ఆంధ్ర ప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు 22న నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి.
ఈ మధ్య ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశ మైంది. అప్పుడు ఎలాంటి సబ్జెక్టు లపై చర్చించ లేదు.
22న నుంచి జరిగే సమావేశాల్లో అన్ని అంశాలు చర్చించ నున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శ్వేత పత్రాలు కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
సోమ వారం నుంచి అసెంబ్లీ సమవావేశాలు
సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్ల పై స్పీకర్ అయ్యన్న పాత్రులు సమీక్ష నిర్వహించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసులు అధికారులను ఆదేశించారు.
ఏపీ శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజుతో కలిసి సమా వేశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
అవి రిపీట్ కావద్దు
సమీక్షలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… అసెంబ్లీ బడ్జెట్ సమా వేశాలు 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అభి ప్రాయ పడ్డారు.
సమావేశాలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్న తాధి కారులను ఆదేశించారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
గతంలో అసెంబ్లీ సమావేశాల టైంలో గ్యాలరీ ల్లో ప్లకార్డు లతో కొంత మంది ప్రవేశించిన ఘటనలు చూశామని అలాంటివి రిపీట్ కావద్దని హెచ్చ రించారు.
అసెంబ్లీ గ్యాలరీ ల్లోకి ప్రవే శించే వారిని పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతించా లన్నారు. గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణం లోనికి అనుమతించా లన్నారు.
కొత్త వాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈసారి అసెంబ్లీ సమావేశా లకు 88 మంది కొత్తగా ఎన్ని కైన శాసన సభ్యులు, 9 మంది శాసన మండలి సభ్యులు రాను న్నారని కావున వారిని గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల న్నారు.
అసెంబ్లీ ప్రాంగణం లోని అన్ని సిసి కెమెరాలు సక్రమంగా పని చేస్తూ ఉండాలని చెప్పారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి, మీడియాకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
భద్రత విషయం లో రాజీ పడ వద్దని పోలీస్ శాఖ అధికారులను శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.
జిల్లాల నుంచి వచ్చే సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు
శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు మాట్లాడుతూ… “అసెంబ్లీ ప్రాంగణం అత్యంత ముఖ్యమైన భద్రతా జోన్ అని ఎవరు బడితే వాళ్లు ప్రవేశానికి వీల్లేదన్నారు.
శాంతి భద్రత లకు విఘాతం కలగని రీతిలో బందోబస్తు ఉండాలని సూచించారు. సెక్యురిటీ, ఇతర నిర్వహణ కు వివిధ జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించాలన్నారు.
వారికి తాగునీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు అందేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.
జగన్ పై చంద్రబాబు ఫైర్
అమరావతి: అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయేందుకే జగన్ దిల్లీ డ్రామాలు ఆడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘‘ శ్వేతపత్రంలోని వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదు. ఆయన పెంచిపోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే అనర్థాలు. వినుకొండ హత్య గంజాయి వల్లే జరిగినట్లు వైకాపా నేతలే ఒప్పుకొన్నారు. శాంతిభద్రతల అంశంలో నేతలంతా క్రమశిక్షణ పాటించాలి. వైకాపా అబద్ధపు విషప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదాం. ఒకట్రెండు కార్పొరేషన్లకే జగన్ నిధులు మళ్లించారు. ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధిని సవాల్‌గా తీసుకొని పనిచేద్దామని ఎంపీలకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.