నియోజకవర్గం – శ్రీశైలం
1) నియోజకవర్గం దేనికి ప్రసిద్ధి
- శ్రీశైలం అంటేనే దట్టమైన నల్లమల అడవులు
- పెద్ద పులుల ఆవాసానికి..దేశానికే తలమానికం నల్లమల అడవులు
- ప్రపంచంలోనే ప్రసిద్ధి కెక్కిన వన్యప్రాణి పెద్దపులుల సంతతి శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు NSTR లోనే ఉన్నాయి..
- అడవుల్లో జీవించే ఆదివాసులు నల్లమల చెంచు గిరిజనులు
- వీరి జీవనం అటవీ ఫల సేకరణ పై ఆధారపడి ఉంటుంది
- శ్రీశైలం నియోజకవర్గం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు.. నియోజకవర్గంలో రెండు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
- అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం
- రెండవది మహానంది పుణ్యక్షేత్రం
2) నియోజకవర్గానికి సొంతమైన ప్రత్యేకతలు…
- శ్రీశైలం డ్యాం ..
- విద్యుత్తు ఉత్పత్తి..
- త్రాగు , సాగు నీటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వెన్నుముక శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం..
3) ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలుఉన్నాయా?..వాటి స్పెషాల్టీ ఏంటి?
ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో శ్రీశైలం అడవుల్లోనే సంచరించారన్న ఆనవాళ్లు ఇప్పటికీ నల్లమల అడవిలో సజీవంగా నిలిచాయి..
కాలినడకన వెళ్లే భక్తులకు అప్పటి లిపి , శిథిలావస్థలో ఉన్న అప్పటి నాగులుటి వీరభద్ర ఆలయం లాంటి మరికొన్ని నిధిలైపోయిన ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తాయి..
పాండవులు దాచిన వజ్ర , వైఢూర్యాలు ఈ నల్లమల అడవిలోనే ఉన్నాయంటూ గుప్తనిధుల వేటగాళ్లు తరచూ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు..
నిధి , నిక్షేపాల నల్లమల్లగా పేరుగాంచింది
ద్రౌపతికి దాహం వేస్తే భీముడు తన గధతో తవ్విన..కొలను ఉంది.. దానినే ఇప్పటికీ భీముని కొల్లంగా పిలువ బడుతుంది..
శ్రీశైలానికి దగ్గర్లోనే నల్లమల అడవిలో మహిమగల ఓ అమ్మవారి ఆలయం ఉంది .. ఆ అమ్మవారిని ఇష్ట కామేశ్వరి అంటారు. ఈ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్లిన భక్తులు .. అమ్మవారిని నుదుట బొట్టు పెడితే ఒక మనిషి శరీరానికి పెట్టినంత మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం.
అలాగే పర్యాటకులకు రూప్ వే.., చెంచు లక్ష్మి మ్యూజియం , జంగిల్ సఫారీలు పర్యాటకులను ఆకట్టు కుంటాయి.
ఇదే నల్లమల అడవులలోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్…అయి చనిపోయారు.
ఆయనకు గుర్తుగా నిర్మించిన YSR స్మృతి వనం పర్యాటకులను ఆకట్టుకుంటుంది
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
వెలుగోడు రిజర్వాయర్.. ఇక్కడి నుంచే మద్రాస్ కు త్రాగు నీటిని అందించే ఘనత ఈ వెలుగోడు జలాశయానికి వుంది
4) ఈ శ్రీశైలం నియోజకవర్గం మొదటగా ఆత్మకూరు నియోజకవర్గం గా కొనసాగింది , 2007 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంగా పేరు గాంచి కొనసాగుతుంది..
- బుడ్డా వెంగళరెడ్డి..
- ఏరాసు అయ్యపు రెడ్డి..
- ఏరాసు ప్రతాప రెడ్డి..
ఈ శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రులుగా ఎన్నికయ్యారు..
5) ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిశ్రమలు లేవు.. వ్యవసాయ పనుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు
6) ఈ నియోజకవర్గంలో చెక్క భజనకు పెట్టింది పేరు …కానీ అవికూడా కాల క్రమేనా.. కనుమరుగయ్యాయి
నల్లమలల లో మరిన్ని శైవ క్షేత్రాలు
7) ఓంకారం , రుద్రకోటేశ్వరుడు, తిరుమల దేవుడు, బైర్లూటి దర్గా.. ఈ ఆలయాలు అన్ని నల్లమల అడవి లోపల ఉంటాయి.
ఈ ఆలయాలకు తరచూ భక్తులు వెళుతుంటారు .. ఫారెస్ట్ అధికారులు భక్తులను నానా ఇబ్బందుల కు గురి చేస్తుంటారు.
ఆలయాల సందర్శనకు అనుమతి లేదంటూ .. భక్తులను ఫారెస్ట్ అధికారులు పలు రకాల ఇబ్బందులు పెడుతుంటారు
8) పంట: ప్రధాన పంట వరి ఎక్కువ విస్తీర్ణంలో వుటుంది , రాగులు , సజ్జలు , జొన్న, మొక్కజొన్న , మినుము , పత్తి , మిరప లాంటి పంటలు కూడా పండిస్తారు..
వంటలు : నియోజకవర్గంలో నాటి ప్రధానమైన వంట..పులుగం , నెయ్యి, పచ్చి పులుసు , బుడ్డల చెట్ని
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
రాజకీయ మంటలు
ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గం లో రాజకీయాలు వాడివేడుగా కొనసాగుతున్నాయి..
2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు
వైసిపి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి & టిడిపి అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ల మధ్యన పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుంది.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఈ రెండు నెలల కాలంలో.. నియోజకవర్గం లో ఒక రాజకీయ హత్య , సుమారు 100 మందికి పైగా వైసిపి నాయకులపై , కార్యకర్తలపై దాడులు..
దాడులపై మీడియాలో కథనాలు రాస్తే..జర్నలిస్టులకు బెదిరింపులు.. రావడం కొస మెరుపు