శిల్పా కార్తీక్ రెడ్డి – Silpa Karthik Reddy

Silpa Karthik Reddy

Silpa Karthik Reddy

*శిల్పా కార్తీక్ రెడ్డి* #SilpaKarthikReddy

శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ. శిల్పా చక్రపాణి రెడ్డి గారి కుమారుడు.. శ్రీ శిల్పా కార్తీక్ రెడ్డి గారు. శ్రీశైలం నియోజకవర్గంలో పరిపాలనలో బాగంగా తండ్రికి తల్లేరు ల పనిచేస్తూ .. తండ్రికి తగ్గ తనయుడిగా నియోజకవర్గంలో పేరు ప్రక్యాతలు సంపాదించుకున్నారు. నియోజకవర్గ యువతలో యంగ్ & డైనమిక్ హీరోలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నియోజకవర్గం లో తండ్రి లేనప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండి యువతలో – కార్యకర్తల్లో మంచి జోష్ నింపే కార్యక్రమాలు చేస్తుంటాడు. నియోజకవర్గంలో పెళ్లిళ్లు.. ఫంక్షన్ లు ఇలా ఏ చిన్న కార్యక్రమలకైనా.. అందుబాటులో ఉంటాడు.

కార్తీక్ ప్రీమియర్ లీగ్ .. క్రికెట్ టోర్నమెంట్

2024. వ, సంవత్సరం జనవరి 5వ తారీఖున కార్తీ క్ ప్రీమియర్ లీగ్ కేపీఎల్ పేరుతో నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి తనేంటో నిరూపించుకున్నాడు. సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చు చేసి యువకులను ఆకట్టుకున్నారు. శ్రీశైలం నియోజకవర్గం నలుమూలల నుండి క్రీడాకారులను వెలికి తీయాలన్నా నేపథ్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ క్రీడాకారులకు శిల్ప కార్తీక్ రెడ్డి నాణ్యమైన క్రికెట్ కిట్లను అందజేసి తనదైన ముద్ర వేసుకున్నారు . 15 మంది ఉన్న టీం కు.. సుమారు 15 వేల రూపాయల విలువచేసే మంచి నాణ్యమైన క్రికెట్ బ్యాట్లు ప్యాడ్లు గ్లౌజులు గాడ్స్ ఇలా వివిధ పరికరాలు కలిగిన క్రికెట్ (కిట్ ) సామాగ్రిని అందించారు. అలా నియోజకవర్గంలో 206 క్రికెట్ జట్లకు కిట్లను అందజేసి తనెంతో నిరూపించుకున్నారు. కిట్లు ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. క్రికెట్ టోర్నమెంట్ ను ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్వహించి తనకంటూ .. ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడల్లో పాల్గొనేటట్లు చూసుకున్నారు. నియోజకవర్గం లోని ప్రతి మండలంలో మంచి క్రికెట్ స్టేడియాన్ని ఎంపిక చేసుకొని.. దాని మరమ్మతులు తనే దగ్గరుండి చూసుకుంటూ క్రీడాకారులకు అనువుగా ఆడేటట్లు తయారు చేయించారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో నైపుణ్యం గల అంపైర్లను తీసుకొని వచ్చి క్రీడాకారుల్లో ఎలాంటి గొడవలు లేకుండా అంపైర్ నిర్ణయమే శిరోధారంగా బావించాలని , క్రీడలలో గెలుపు ఓటములు సహాజమని .. ఫ్రెండ్లీగా ఆడాలని .. క్రీడాకారులకు పలు సలహాలు సూచనలు అందించారు. నియోజకవర్గంలో అంతా సుడిగాలి పర్యటన చేస్తూ ఒక్కసారిగా క్రీడా సంబరాన్ని ఉత్తేజపరిచారు. జనవరి 9న స్టార్ట్ అయిన కార్తీక్ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ను జనవరి 18 తేదీ అట్టహాసంగా ముగింపు కార్యక్రమం జరిగింది. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్ కు స్వయంగా దగ్గరుండి ప్రతిరోజు నాలుగు మండలాలు తిరిగేస్తూ సంక్రాంతి పండగను కూడా కుటుంబంతో గడపకుండా క్రీడాకారుల మధ్య గడిపి కేవలం పది రోజుల్లోనే 206 జట్లకు మ్యాచ్ లు నిర్వహించి జనవరి 18 తారీఖున ఫైనల్ మ్యాచ్ జరిగింది.

ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు .. MLA శిల్పా చక్రపాణి రెడ్డి ప్రత్యేక గెస్ట్ గా వచ్చి తిలకించారు.

ఫైనల్ మ్యాచ్ ఆత్మకూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు నియోజకవర్గం నలుమూలల నుండి YSRCP కార్యకర్తలు , నాయకులు తరలి వచ్చారు. ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన సున్నిపెంట టీంకు ట్రోఫీతో పాటు 1. లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. రన్నరఫ్ గా నిలిచిన ఆత్మకూరు జట్టుకు 50 వేల రూపాయలు అందించారు. అంతేకాకుండా సెమీఫైనల్ లో ఓడిన జట్లకు మళ్లీ మ్యాచ్ నిర్వహించి అందులో గెలుపొందిన టీంకు మూడవ స్థానంగా 20,000 అందించారు. ఓడిన జట్టుకు నాలుగవ స్థానంగా 10.000 వేల రూపాయలు అందించారు. అదే కాకుండా 2006 జట్లకు కార్తీక్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు 2000 రూపాయలు అందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ , మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లకు , ఎంపికైన వారికి బహుమతులు అందించారు . క్రీడాకారులు , ప్రేక్షకులకు బోజన సదుపాయాలు శిల్పా కార్తీక్ రెడ్డి కల్పించి ఏలోటు లేకుండా చూసుకున్నారు.

Also Read నల్లమలకు అడవి దున్న

#SilpaKarthikReddy Buy it a good pen drive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top