సిద్దాపురం చెరువు పెద్ద తూము రాడ్డు విరిగిపడి వృధాగా పోతున్న నీరు
వృధాగా పోతున్న నీరంతా సమీప పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువుకు సంబంధించిన పెద్ద తూము రాడ్ విరిగి నీరంతా వృధాగా పోతుంది ..ఇప్పటికే చెరువుకు సమీపాన వున్న వరి ,మిరప ,మినుము ఇలా పలు పంటలు నష్టమయ్యే అవకాశం వుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.మాండోస్ తఫాను ప్రభావంతో ఐదు రోజులు కురిసిన వర్షాలకు నష్టపోయామని మళ్లీ ఇప్పుడు తూము నీళ్ళతో పంటలు పూర్తిగా నష్ట పోయే అవకాశం వుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోకి నీళ్లు రాకుండా రైతులు JCB సాయంతో అడ్డుకట్టలు వేసుకుంటుంన్నారు.
ఈ విషయం స్థాని నాయకులు..మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి.. యుద్ధ ప్రాతిపదికన తూమును మూసివేయాలని అధికారులకు ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో.. ఇరిగేషన్ అధికారుల సలహాలతో..స్థానిక వైసిపి నాయకులు విజయ్ చౌదరి టిప్పర్ల సహాయంతో గ్రావెల్ ను తీసుకరావడం జరిగింది. గ్రావెల్ ను సంచులకు నింపి తూమును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో స్థానిక గ్రామాల రైతులు ఊపిరి పీల్చుకుంటుంన్నారు.