మరణంలోను చూసే కన్ను…! రెప్ప మూత పడ్డా ప్రసరించిన దృష్టి…!!
తన భార్య మరణించినా .. కళ్ళు దానమిచ్చి ఇతరుల జీవితాల్లో వెలుగును నింపాలని పుట్టెడు దుఃఖం లోనూ కాశీపురం ప్రభాకర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య భాగ్యలక్ష్మి కళ్లను దానమిచ్చాడు.
తన భార్య భాగ్యలక్ష్మి మరణించినా.. దానమిచ్చిన కళ్ళు మాత్రం ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి. తను చనిపోయి ఇతరులకు వెలుగునిచ్చిన దన్యురాలు ధన లక్ష్మీ
చల్లని చూపును ప్రసరిస్తూ విప్పారిన ఆ విశాల నేత్రాలు ఈనెల 17 – 12- 2022 అర్ధరాత్రి శాశ్వతంగా మూత పడ్డాయి. 52 సంవత్సరాల మధ్య వయసుకే ఆమెను ఉరమని పిడుగు లాంటి గుండెపోటు కబలించింది.ఒక ఇంటిని చీకటి మయం చేసింది. ఆమె ధనలక్ష్మి దేవి… ఆమె సీనియర్ పాత్రికేయుడు కాశీపురం ప్రభాకరరెడ్డి సహచరి.
పుట్టెడు దుఃఖంతో చేష్టలుడిగిన ప్రభాకర్ కు తనకు తన భార్యకు తరుచూ నేత్రదానం గురించి జరుగుతూ వచ్చిన చర్చ గుర్తుకు వచ్చింది.తాము మరణించినా తలో ఇద్దరికి చూపును అందించ వచ్చుననే సదాశయం జ్ఞప్తికి వచ్చింది.వెంటనే ప్రభాకర్ రెడ్డి తన మిత్రుడైన గోపీ రెడ్డి శ్రీనివాసరెడ్డి ని సంప్రదించాడు.అలస్యంకాకుండా గోపిరెడ్డి నేరుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని హృద్రోగ శస్త్ర చికిత్సా వైద్యులు ప్రభాకరరెడ్డికి విషయం చేరవేయడంతో ఆయన ఆసుపత్రి సూపరిండెంట్ మరియు నేత్ర చికిత్సా విభాగపు అధిపతి అయిన నరేంద్ర నాథరెడ్డిని అప్రమత్తం చేశారు.
దీనితో ఆలస్యం జరగకుండా ఆయన తన సిబ్బందిని నంద్యాలకు పంపించారు.కొండంత దుఃఖం వలపోస్తున్న కుటుంభ సభ్యుల అంగీకారం నడుమ కర్నూలు సర్వజన వైద్యశాల నేత్ర వైద్య విభాగపు సిబ్బంది ధనలక్ష్మి దేవి రెండు కళ్ళకు చెందిన రెటీనా లను లాఘవంగా తొలగించి భద్రపరిచారు.ఆ రెటీనా లు అభాగ్యులై చూపు కోల్పోయిన ఇద్దరికి చీకటి బతుకు నుంచి విముక్తి కలిగించేందుకు కర్నూలు సర్వజన వైద్యశాల ఐ భ్యాంకుకు చేరుకున్నాయి.భౌతిక శరీరానికి మరణం ఉండవచ్చేమో కానీ వెలుగులు ప్రసరించే చూపుకు మరణం లేదని ధన లక్ష్మీ దేవి మరణం నిరూపించింది.