మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

Chief Minister Chandrababu Naidu's speech at Mahanadu

Chief Minister Chandrababu Naidu's speech at Mahanadu

Maha Nadu – Day 2

మహానాడు 2వ రోజు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాంశాలు

తెలుగు తేజం, పౌరుషం, ఆత్మగౌరవం…యుగపురుషుడు
• మహానాడుకు సముద్రంలా పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, చెళ్లెమ్మలకు, టీడీపీ వీరాభిమానులకు అందరికీ నమస్కారం.
• ఈ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ-రాజకీయ సార్వభౌముడు… శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి.
• మహనీయులు, కారణ జన్ములు ఎన్టీఆర్ గారికి మహానాడు వేదికగా ఘన నివాళులు అర్పిద్దాం.
• సాధారణంగా ఒక వ్యక్తిని గాని, ఒక సినిమా హీరోను గాని, ఒక రాజకీయ నాయుకుడిని గాని కొంత మంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలు అభిమానిస్తాయి.
• కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్.
• ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు. ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు.
• మనకు తెలిసిన, మన కళ్ల ముందు కనిపించిన యుగపురుషుడు ఎన్టీఆర్.
• ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు.

• సినీ-రాజకీయాల్లో సింహం:

• ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు – మరెన్నో మెరుపులు… ఇంకెవరీ జీవితంలోనూ చూడని మజీలీలు…
• ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి. తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్‌గా ఎదగడం.. ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం.. ఇది అనితరసాధ్యం.
• ఎన్టీఆర్‌ జీవితం పూల పాన్పు కాదు…నిరంతర పోరాటంతోనే ఎదిగారు.
• స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆభరణాలు.
• పాలు అమ్ముతూ చదువుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం చేసినా, సినిమాల్లో నటించినా, రాజకీయాల్లోకి వచ్చినా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడలేదు.
• ఒక సామాన్య రైతుబిడ్డగా పుట్టి… 33 ఏళ్లు వెండితెర జీవితంలోనూ, 14 ఏళ్లు రాజకీయ జీవితంలోనూ అద్వితీయ చరిత్ర సృష్టించారు.
• అందుకే, ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు… నరాల్లో ఉత్తేజం వస్తుంది. కొండనైనా ఢీ కొట్టగలం అనేంతగా ఆత్మవిశ్వాసం వస్తుంది. పట్టుదల వస్తుంది. అదీ ఆయన పేరులో ఉన్న పవర్.

• అత్యంత ఆకర్షణ గల నేత:

• ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు – సమ్మోహన శక్తి. ఎన్టీఆర్ మాటే మంత్రం.
• దేశ రాజకీయాల్లో అంతటి ఆకర్షణ కలిగిన నాయకుడు ఇప్పటికీ లేడు.
• తనను వెండితెర ఇలవేల్పును చేసిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలి అనుకున్నారు… అందుకే ఎంత కష్టమైనా వెనకడుగు వేయలేదు. 60 ఏళ్ల వయసులో ముందడుగు వేశారు.
• ప్రజలపై ప్రేమాభిమానాలు…, అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలన్న పట్టుదల…, ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చేలా చేసింది.
• చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ నాటి అవినీతి రాజకీయాలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన గర్జించారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే ఆకాశం ఉరిమినట్టు ఉండేది.
• పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన రికార్డ్ మరెవ్వరికీ లేదు. అది ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం.
• ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా… రైతుకు నేస్తం.. తాడిత పీడితులకు ధైర్యం… యువతకు భవిష్యత్తు… మహిళలకు అండ… కార్మికులకు అభయం…. అన్ని వర్గాలు కీర్తించే నాయకుడు.
• ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు’ అనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు.
• అధికారం అంటే బాధ్యత అని చాటి చెప్పారు. పదవి అంటే సేవ చేసే అవకాశమని నిరూపించారు.
• పాలకులు అంటే సేవకులు అని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన నాయకుడు ఎన్టీఆర్.

• తెలుగు జాతి దిశను మార్చిన పసుపు జెండా:

• ఎన్టీఆర్ పార్టీ పెట్టి… కూడు గూడు గుడ్డ తన విధానం అన్నారు.
• పార్టీ గుర్తులో ఇల్లు, నాగలి, చక్రంతో తన ప్రాధాన్యాలు వివరించారు.
• 43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూపొందించిన జెండా ప్రజాసేవలో దిగ్విజయంగా రెపరెపలాడుతోంది.
• పసుపు జెండా అంటే….తెలుగు వారి ఆత్మ గౌరవం చాటిన జెండా…
• పసుపు జెండా అంటే….తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా…
• పసుపు జెండా అంటే…దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన జెండా!
• పసుపు జెండా అంటే….తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా
• పసుపు జెండా అంటే….ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా…
• పసుపు జెండా అంటే….రైతన్నల కన్నీరు తుడిచి వెన్నంటే ఉన్న జెండా…
• పసుపు జెండా అంటే…విజన్ తో తెలుగుజాతికి విజయాన్నిచ్చిన జెండా!
• పసుపు జెండా అంటే….తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్, భరోసా!
• సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన తో పాలనలో కొత్త ఒరవడికి ఎన్టీఆర్ ఆద్యులుగా నిలిచారు.
• పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చారు.
• అందరికీ పక్కా ఇళ్లు… బడుగులకు జనతా వస్త్రాలు అందించారు.
• వృద్ధాప్య పెన్షన్లు, రూ.50కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు…
• సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం… ఇలా సంక్షేమాన్ని- అభివృద్ధిని సమతుల్యం చేశారు.
• పటేల్‌ `పట్వారి వ్యవస్థ రద్దు, సింగిల్ విండో విధానం, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఎన్‌టిఆరే.

• రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవ:

• రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎన్టీఆర్ ప్రజల కష్టాల గురించే ఆలోచించేవారు.
• ప్రజలు కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ముందుకొచ్చి సాయం చేసేవారు.
• 1952 సంవత్సరంలో రాయలసీమలో కరువు వచ్చినప్పుడు,1962లో భారత్‌`చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడూ విరాళాలు సేకరించారు.
• 1965లో భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు, 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు.
• 1977లో దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు… వేల మంది మృత్యువాత పడి, లక్షలాది మంది నిరాశ్రయులైతే స్వయంగా దివిసీమ వెళ్లి సేవా కార్యక్రమాలు చేపట్టారు.

• ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేద్దాం…స్వర్ణాంధ్ర సాధిద్దాం:

• ఈ నాలుగు దశబ్దాల్లో ఎన్నో మైలురాళ్లు దాటొచ్చాం…ఎన్నో విజయాలు, మరెన్నో అనుభవాలు.
• ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళ్తున్నాం. ఆయన స్ఫూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలకు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం.
• 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టాం.
• పేదరికం లేని సమాజం కోసం ఎన్టీఆర్ తపించారు. ఆయన ఆశయ సాధన కోసం పీ4 విధానాన్ని తీసుకువచ్చాం. దీని ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధిస్తాం.
• ఆర్ధిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతాం.
• పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకొచ్చిన 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయి.
• ఎన్టీఆర్ ఆశీస్సులు మనకు ఉన్నాయి. తెలుగుజాతి 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతంది.
• ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పిస్తూ, ఉన్నతంగా ఎదగాలి, విజయం సాధించాలని ఈ కడప మహానాడులో సంకల్పం తీసుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top