మోదీ పర్యటనలో భద్రత లోపం

Security lapses during Modi's visit

Security lapses during Modi's visit

  • కళ్లు మూసుకుని పాస్ లు జారీ
  • ఒక్కొక్కరికీ వేర్వేరు హోదాలో రెండు పాసులు
  • ప్రధాని సమీపంలోకి ఒకరి బదులు ఇంకొకరు
  • బాధ్యులపై చర్యలకు మీనమేషాలు

ఆత్మకూరు : అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉండే దేశ ప్రధాని సమీపంలోకి టాంపర్
పాస్ లతో ఇద్దరు వ్యక్తులు వెళ్లడం సంచలనంగా మారింది. వీవీఐపీల భద్రత ప్రమాణాలపై పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలిస్తే మరిన్ని భద్రతా లోపాలు బయటపడుతు న్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటనలో పాల్గొన్న కొందరు రెండు పాస్ లు కలిగి ఉండి వేర్వేరు చోట్ల ఆయనకు దగ్గరగా వెళ్లారు. జిల్లా భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు గుండాల మధుసూదన్ రావు పేరుతో ఒక పాస్ తీసుకుని సున్నిపెంట హెలిపాడ్ వద్ద ప్రధానిని స్వాగతిం చాడు. అలాగే అభిరుచి మధు పేరుతో మరొక పాస్ తీసుకుని ప్రధానికి హెలిపాడ్ వద్ద వీడ్కోలు పలికారు.

అలాగే మోమినా షబానా స్టేట్ బీజేపీ మైనా ర్టీ మోర్చా ఇన్చార్జ్ గా ఒక పాస్ పొంది శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబా ఆలయం వద్ద ప్రధానికి స్వాగతం పలికే బృందంలో ఉన్నారు. అలాగే మోమిన్షబానా బీజేపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ పేరుతో మరో పాస్ తీసుకుని సున్నిపెంట హెలిపాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే బృందంలోచేరారు. ఇంత సులువుగా రెండు పాస్లు పొంది రెండు వేర్వేరు చోట్ల ప్రధానికి అత్యంత సమీపంలో సంచరించే అవకాశం పొందడం వీవీఐపీ భద్రత లోపాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది. అలాగే ముఖ్య నాయకుల పేర్లను వాడుకుని పాస్లు పుట్టించుకుని ఇతరులు వీవీఐపీని అనుసరించవ చ్చునని తేటతెల్లమవుతోంది. ఇంత పెద్ద భద్రతా లోపాలపై అధికారులు ఎవరూ పెదవి విప్పక పోవ డం, ఎవరిపై చర్యలు తీసుకోక పోవడం విమర్శ లకు తావిస్తోంది. భద్రతా లోపాలకు కారణాలే మిటో గుర్తించి కారకులపై తగు చర్యలు తీసుకో వాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top