AP kurnool district:ఘనంగా భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు కెవిపిఎస్ ఆఫీసు నందు చిన్నప్ప అధ్యక్షతన జరిగాయి ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసినానంతరం కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్ తిమ్మన్న మాట్లాడుతూ 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్ గాంవులో సావిత్రిబాయి జన్మించింది సావిత్రిబాయి జన్మించింది తొమ్మిదేళ్ల వయస్సున జ్యోతిరావు పూలేను వివాహం ఆడింది నిరక్షరాశులుగా ఉన్న సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. విజ్ఞానం నేర్పి సామాజిక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు 1847 నాటికి భర్తతో కలిసి శూద్రుకులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాల ప్రారంభించారు ఈ పాట శాల నడపడం అప్పుడు పెద్ద వర్గాలకు నచ్చలేదు భౌతిక దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం రాళ్లు విసరడం అసభ్య పదజాలాలని వాడటం వంటివి చేసేవారని అన్నారు పిల్లలను కణాలనే కోరికను త్యాజించి ప్రపంచమే ఇల్లుగా మార్చుకుని అనాధల్ని అక్రమసంతానంగా పుట్టి రోడ్ల పైన బిడ్డల్ని తన బిడ్డలుగా చేసుకుంది సావిత్రిబాయి 19 వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ హక్కుల పోరాటంలో సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర మరువలేనిది అన్నారు ఉద్యమాల్లో నాయకత్వ స్థానాల్లో నిలిచిన ఏకైక మహిళ సావిత్రిబాయి అన్నారు దేశ చరిత్రలోనే వెన్నదగిన సామాజిక విప్లవకారుడుగా కీర్తించబడ్డ జ్యోతి బా పూలేకే అన్ని రకాలుగా తన అండతండాలని ఇచ్చింది భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది సావిత్రిబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహచారిగా నిలిచిపోయిందని అన్నారు సావిత్రిబాయి పూలే గొప్ప కవి రచయిత్రి చీకటి ఆలోచనలను త్యాగం చేసే నిబద్దతగా కలిగిన మహిళ అనే వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో చర్మ కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి. సుమల అంతోని, చర్మ కళాకారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి సుమాల రాజు కె వి పి ఎస్ మండల నాయకులు గుంటప్ప, అరుణ్, రాముడు తదితరులు పాల్గొన్నారు.
సావిత్రి బాయి పూలే స్పూర్తితో మహిళల పై అఘాయిత్యాలను అడ్డుకుందాం AIDWA – SFI – DYFI

విద్యార్థులకు రక్షణ కల్పించడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మిగనూర్ మండలం బనవసిలో ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థినిలపై లైంగిక చర్యలకు పాల్పడిన వారిని వారికి సహకరించిన వారిని తక్షణమే సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఐదు జిల్లా కార్యదర్శి అలివేలమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు యం. రంగప్పలు డిమాండ్ చేశారు.
శుక్రవారం ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బనవసి బాలికల గురుకుల కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాసంస్థలలో విద్యార్థినిలకు రక్షణ కరువవుతుందని
ఎమ్మిగనూరు మండలం బనవసిలోని ఏపీఆర్జేసీ బాలికల కళాశాలలో విద్యార్థులు అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధించిన ప్రతిఒక్క అధ్యాపకునిపై తక్షణమే కేసును నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో రోజురోజుకు మహిళల పట్ల విద్యార్థుల పట్ల చిన్న పిల్లల పట్ల దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వీటిని నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతున్నాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు నేర్పించాల్సినటువంటి గురువులే వారి పట్ల రాక్షసుల మారి వారిని లైంగికంగా వేధిస్తుండడం దారుణం అన్నారు. తక్షణమే బనవసిలో ఉన్న గురుకుల బాలికల కళాశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, మూడు నెలలకు ఒకసారి పెరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, మగ ఉపాధ్యాయులను తీసి మహిళా ఉపాధ్యాయులను నియమించాలని, ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారణ జరిపించాలని ఆయన డిమాండ్. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పద్మ, శ్యామల, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, విల్సన్, కర్ణకర్ తదితరులు పాల్గొన్నారు.