వారసత్వ ఆస్తిపై ఫోర్జరీ రికార్డులు నకిలీ పాసుబుక్కులు పుట్టించిన రెవెన్యూ అధికారులపై లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు
తమ పూర్వీకుల నుండి సంక్రమించిన వారసత్వ ఆస్తిపై ఫోర్జరీ రికార్డులు నకిలీ పాసుబుక్కులు పుట్టించిన వారిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన దూదేకుల మోదీన్ సాహెబ్ పింజరి మొహమ్మద్ లు లోకాయుక్త కోర్టును ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే ఆత్మకూరు పట్టణంలోని సర్వే నెంబరు 825ఎ1 ఒక ఎకరా 1.16 పదహారు సెంట్లు వ్యవసాయ భూమి ఉందన్నారు. ఈ భూమి వారి పూర్వీకులైన పింజరి హుస్సేన్ సాహెబ్ నుండి వారసత్వంగా తమకు చెందిందని అయితే ఈ భూమిపై కన్ను వేసిన పింజరి రాజు అనే వ్యక్తి తన పేరున ఫోర్జరీ రెవిన్యూ రికార్డులతో పాటు నకిలీ పాసుబుక్కులను పుట్టించాడని స్థానిక తహశీల్దారు కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ న్యాయం జరగకపోవడంతో రెవెన్యూ డివిజన్ అధికారి దాసుకు ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో రెవెన్యూ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడడం చట్ట విరుద్ధ తీర్పులు ఇవ్వడంపై లోకయుక్త కోర్టులో ఫిర్యాదు చేశామని బాధితులు మీడియాకు తెలిపారు.
