ఐకమత్యానికి ప్రతీక గోరంట్లవారిపల్లి వడ్డెర్లు

vadderalu-www.polticalhunter.com_..jpg

– గ్రామంలో వడ్డెర్ల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు

– అతి చిన్న గ్రామమైన ఐకమత్యంతో కలిసి మెలిసి జీవిస్తున్న వడ్డెర్లు

– 24-12-2022 శనివారం గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్న *వడ్డే వెంకట్*, వడ్డెర సంఘం నాయకులు…

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం గోరంట్లవారిపల్లి…. ఈ చిన్న గ్రామంలో 23 వడ్డెర కుటుంబాలు ఎంతో ఐకమత్యంతో కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు..ప్రతి సంవత్సరం ఏకాదశి సందర్భంగా గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు 3 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వడ్డెరలందరినీ ఆహ్వానిస్తున్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పల్లకి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో ఆ దేవాలయాన్ని పాలరాతితో నూతనంగా పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వడ్డెర సంఘం నాయకులందరినీ ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. సుమారు రూ. 40 లక్షల వ్యయంతో పునరుద్ధరిస్తున్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ఎల్లుండి శనివారం *వడ్డే వెంకట్* గారిచే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు ఈ బృహత్తర కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రతి వడ్డెర బిడ్డ కదలి రావాలని గోరంట్లవారిపల్లి వడ్డెర్లు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top