AP ; ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పదవి ఎవరికి కేటాయిస్తారనే విషయంపై సామాన్య ప్రజల్లో సైతం చర్చ మొదలైంది.. 14 నియోజకవర్గాల్లోనూ హేమహేమీలు గెలుపొందడంతో మంత్రి పదవి పై పలువురు ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు… ధర్మవరం బిజెపి బిజెపి ఎమ్మెల్యే సత్య కుమార్ కూటమి మంత్రివర్గ రేసులో ముందంజలో ఉన్నారని సమాచారం…. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు సైతం ఆయనకు మంత్రి పదవి ఇస్తేనే జిల్లా ఉపాధికల్పన, పారిశ్రామిక రంగాల్లో ముందుంటుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు…
బిజెపి జాతీయ కార్యదర్శిగా ఉన్న ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ పేరు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి సుపరిచితమే… పలు రాష్ట్రాలకు బిజెపి ఇన్చార్జిగా ఉంటూ ఆ పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సత్య కుమార్ కు బిజెపి అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి… ఎన్నికల ప్రచారంలో కూడా కూటమి కార్యకర్తలు… సత్య కుమార్ గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు… దీనికి తోడు ఎన్నికల ప్రచార సభలో ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా పాల్గొనడంతో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని సత్యకుమార్ మాత్రమే బయటపడవేయగలరని పట్టణ ప్రజలు గట్టిగా నమ్మారు… దీంతోనే ధర్మవరం పట్టణంలో ఏకంగా 15 వేల పైచిలుకు మెజార్టీ రావడంతోనే… గ్రామీణ ప్రాంతాల్లో వైకాపాకు వచ్చిన మెజార్టీని అధికమించి బిజెపి విజయ బావుట ఎగురవేసింది…
కేంద్ర నాయకత్వ అండదండలు పుష్కలంగా ఉన్న సత్యకుమార్ కు క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఆర్థిక లోటు పూడ్చే వ్యక్తిగా సత్య కుమార్ పై చంద్రబాబు నాయుడు కు నమ్మకం ఉన్నట్లు టిడిపి పార్టీ నాయకుల అంతర్గత సమీక్షా సమావేశంలో పేర్కొంటున్నారు.. ధర్మవరం ,చీరాల ,హిందూపురం తదితర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున చేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు… ఆయనకు మంత్రి పదవి ఇస్తే కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి చేనేత రంగ సంక్షోభాన్ని పరిష్కరించగలరని కూటమి నాయకత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది…
అదీగాక అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొత్తం స్థానాలు గెలుపొందడం వెనుక యాదవ సామాజిక వర్గం కూడా బలంగా పనిచేసినట్లు తెలుస్తోంది… కేవలం రెండు సామాజిక వర్గాలకే సామాజిక న్యాయం జరుగుతుండడంతో యాదవ సామాజిక వర్గం అసంతృప్తితో రగిలిపోతూ వస్తోంది… యాదవ సామాజిక వర్గ అసంతృప్తిని గమనించి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా వెంకట శివుడు యాదవ్ ను నియమించారు… రాజ్యాంగ పదవులు ఆ రెండు సామాజిక వర్గాలకు, తమకు పార్టీ పదవుల అంటూ యాదవ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీపై కూడా పెదవిరిచారు..
బిజెపి అధినాయకత్వం జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ను ధర్మవరం నుండి రంగంలోకి దింపడంతో యాదవ సామాజిక వర్గం మొత్తం గంప గుర్తుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్ల రూపంలో గుమ్మరించింది… దీంతో ధర్మవరం, సింగనమల, మడకశిర, కదిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయానికి యాదవ ఫార్ములా దోహదపడిందని రాజకీయ పండితులు విశ్లేషించుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ కు బిజెపి కోటాలో మంత్రి పదవి లాంచనమేనని తెలుస్తోంది… దీంతో రాష్ట్రవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు ముందస్తుగా సంబరాల్లో మునిగిపోయారు…