సజ్జల ఎస్టేట్‌లో 63 ఎకరాలు స్వాధీనం – హద్దులు పాతి, బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది
సజ్జలకు షాక్ ఇచ్చిన కూటమి సర్కార్
సజ్జల కుటుంబ ఎస్టేట్ లోని ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్ కు చెందిన 184 ఎకరాల్లో 63 ఎకరాలు అక్రమిత భూమి ఉందని గుర్తించిన అధికారులు
వైసీపీ నాయకులు, గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారి కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్న అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్‌కు చెందిన 184 ఎకరాలలో 63 ఎకరాలు ఆక్రమిత భూమిగా అధికారులు గుర్తించారు. అందులో 52 ఎకరాలు అటవీ భూమి అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్ దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీకే దిన్నె తహశీల్దార్ సజ్జల ఎస్టేట్‌లో ఉన్న ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది హద్దులు వేసి, బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 63 ఎకరాల్లో 52 ఎకరాల అటవీ భూమిని ఆ శాఖకు అప్పగించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.