పత్రికా ప్రకటన
తేదీ,22/05/2025
అన్నమయ్య జిల్లా..
రాత్రిపూట/పగటి పూట దొంగతనాలకు పాల్పడిన పేరు మోసిన ముగ్గురు అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.
దాదాపు 1 కేజీ బంగారం, విలువ కోటి రూపాయలు. 3కేజీల వెండి, విలువ దాదాపు 3 లక్షల రూపాయలు, 1 లక్షా 40 వేల రూపాయల నగదు, 2 ద్విచక్ర వాహనాలు మరియు 1 ఆటో స్వాధీనం.
కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను, మరియు సిబ్బందిని అభినందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు.
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు.
క్రైమ్ నెంబర్: మన్నూరు U/G PS, Cr. No. 142/2025 U/S 331(3), 305 BNS Act
ముద్దాయిల పేర్లు వివరాలు
- (1) తోట శివ కుమార్, అలియాస్ శివ భవాని, వయస్సు:33 సంll, తండ్రి: లేట్ వెంకట సత్యనారాయణ, స్వగ్రామం: లక్కవరం గ్రామం, గౌరవరం పంచాయతీ, కోయలగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం: ఎర్రగడ్డ కాలనీ, గాజువాక, విశాకపట్టణం జిల్లా.
- (2) జెట్టి సుబ్రహ్మణ్యం @ సుబ్బు, వయస్సు:27 సంll, S/oమారప్ప, కులము: SC-మాల, స్వగ్రామం: మొరవారిపల్లి గ్రామం, పులిచెర్ల మండలం, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం: D.No.1/179, భవాని నగర్, తిరుపతి సిటీ మరియు జిల్లా.
- (3) సూరేపల్లి వెంకటేష్ @ వెంకి, వయస్సు:21 సంll, తండ్రి: గంగయ్య, కులము: SC-మాల, R/o మాధవరంపోడు గ్రామం, రైల్వే కోడూరు మండలం, అన్నమయ్య జిల్లా.
అరెస్ట్ తేదీ, సమయం, స్థలం వివరములు: తేది: 21.05.2025 వ తేదీన సాయంత్రం 7 PM గంటలకు రాజంపేట మండలం ఊటుకూరు గ్రామం సంజీవరాయ స్వామి దేవాలయం ముందర, ఎన్ హెచ్ 716 రోడ్డుపై అరెస్ట్ చేయడం జరిగింది.
రికవరీ చేసిన చోరి సొత్తు మొత్తం విలువ సుమారు రూ.1 కోటి రూపాయలు. ఇంకా మిగతా బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీ వద్ద, మరియు ఇతర వ్యక్తుల వద్ద రికవరీ చేయాల్సి ఉంది.
- (1) సుమారు 961 గ్రాములు బంగారు ఆభరణాలు, విలువ సుమారు రూ. 1 కోటి రూపాయలు.
- (2) 3 కేజీలు వెండి వస్తువులు, విలువ సుమారు రూ. 3 లక్షల రూపాయలు.
- (3) 1 లక్షా 40 వేల రూపాయల నగదు.
- (4) 2 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం.
ముద్దాయిలు నేరాలకు పాల్పడిన కేసుల వివరాలు, మొత్తం చేసిన నేరాలు – 17
- (1) బొమ్మూరు PS, Cr.No.428/2024 U/s 331(4), 305 BNS
- (2) నక్కపల్లి PS, Cr.No.01/2025 U/s 331(3), 305 BNS
- (3) తిరుచానూరు PS, Cr.No.40/2025 U/s 331(4), 305 BNS
- (4) తిరుచానూరు PS, Cr.No.69/2025 U/s 331(4), 305 BNS
- (5) తిరుచానూరు PS, Cr.No.144/2025 U/s 331(4), 305 BNS
- (6) తిరుచానూరు PS, Cr.No.183/2025 U/s 331(4), 305 BNS
- (7) తిరుచానూరు PS, Cr.No.184/2025 U/s 331(4), 305 BNS
- (8) పీలేరు U/G PS, Cr.No.92/2025 U/s 331(4), 305 BNS
- (9) పీలేరు U/G PS, Cr.No.93/2025 U/s 331(4), 305 BNS
- (10) రాయచోటి U/G PS, Cr.No.80/2025 U/s 331(3), 305 BNS
- (11) రాజంపేట U/G PS, Cr.No.72/2025 U/s 331(4), 305 BNS
- (12) రాజంపేట U/G PS, Cr.No.160/2025 U/s 331(4), 305 BNS
- (13) ఓబులవారిపల్లి PS, Cr.No.119/2025 U/s 331(4), 305 BNS
- (14) మన్నూరు U/G PS Cr.No.136/2025 U/s 331(4), 305 BNS
- (15) మన్నూరు U/G PS Cr.No.134/2025 U/s 331(3), 305 BNS
- (16) మన్నూరు U/G PS Cr.No.142/2025 U/s 331(3), 305 BNS
- (17) మన్నూరు U/G PS Cr.No.143/2025 U/s 331(4), 305 BNS
నేరాల గురించి వివరములు:- గతంలో విజయవాడ, బందర్, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిగూడెం, హనుమాన్ జంక్షన్, కోయిలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సుమారు 150 కేసుల్లో అరెస్టు అయి జైలు శిక్ష అనుభవించి, బెయిల్ పై విడుదల అయిన తోట శివ కుమార్ అను అతను, 2024 వ సంవత్సరం డిసెంబర్ 15 వ తేదీన గుంటూరు జైలు నుండి విడుదలయ్యి అనకాపల్లిలో ఉంటూ బొమ్మూరు, నక్కపల్లిలో దొంగతనాలు చేసి మరో ఇద్దరు అనుచరులు అయిన జెట్టి సుబ్రహ్మణ్యం @ సుబ్బు, సూరేపల్లి వెంకటేష్ @ వెంకి అను వారితో కలిసి తిరుపతి జిల్లాలోని తిరుచానూరు, అన్నమయ్య జిల్లా లోని పీలేరు, రాయచోటి, రాజంపేట, మన్నూరు, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్ళను టార్గెట్ గా చేసుకొని రాత్రి/పగలు కన్నపు నేరాలకు పాల్పడిన, తోట శివ కుమార్, అలియాస్ శివ భవాని మరియు అతని అనుచరులు జెట్టి సుబ్రహ్మణ్యం @ సుబ్బు, సూరేపల్లి వెంకటేష్ @ వెంకి అనువారిని ఈ దినం అనగా 21.05.2025 వ తేదీన 7 PM గంటలకు మన్నూరు U/G PS, Cr.No.142/2025, U/S 331(3), 305 BNS కేసులో రాజంపేట మండలం, ఊటుకూరు గ్రామం, సంజీవరాయస్వామీ దేవాలయం ముందర NH-716 రోడ్డుపై అరెస్టు చేయడమైనది.
ముద్దాయిలు నేరము చేసిన విధానం.
A1 ముద్దాయి తోట శివ కుమార్ అను అతను గుంటూరు జైలులో ఉండగా, గంజాయి కేసులో అరెస్టు అయి గుంటూరు జైలుకి వెళ్ళిన A2. ముద్దాయి జెట్టి సుబ్రహ్మణ్యం అతని భార్య దేవిలు A1 ముద్దాయి తోట శివ కుమార్ కి పరిచయం అయినారు. జైలులో ఉండగా A1 ముద్దాయి తోట శివ కుమార్ మరియు A2.ముద్దాయి జెట్టి సుబ్రహ్మణ్యం @ సుబ్బు ఒకరికొకరు వారి ఫోన్ నెంబర్లు ఇచ్చుకొన్నారు. అంతట A1 ముద్దాయి తోట శివ కుమార్ 2024 వ సంవత్సరం డిసెంబర్ నెలలో జైలు నుండి విడుదల అయిన తరువాత A2.ముద్దాయి జెట్టి సుబ్రహ్మణ్యం @ సుబ్బు అను అతను A1 ముద్దాయి తోట శివ కుమార్ ను తిరుపతికి పిలిపించగా, అక్కడ A2.ముద్దాయి జెట్టి సుబ్రహ్మణ్యం @ సుబ్బు యొక్క మొదటి భార్య దేవి అను ఆమె ద్వారా, దేవి యొక్క రెండవ భర్త సూరేపల్లి వెంకటేష్ A3 అను అతను A1 ముద్దాయి తోట శివ కుమార్ కి పరిచయం అయినాడు. అంతట A1 to A3 ముద్దాయిలు తిరుచానూరు, పీలేరు, రాయచోటి పోలీస్ స్టేషన్ల పరిధిలో కన్నపు నేరాలకు పాల్పడిన తరువాత అక్కడ వారిపై పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో 2025 వ సంవతరం ఏప్రిల్ నెల చివరి వారంలో A3.ముద్దాయి సూరేపల్లి వెంకటేష్ అను అతను A1 ముద్దాయి తోట శివ కుమార్ మరియు అతని భార్య వరలక్ష్మిని రాజంపేటకి పిలిపించి వారికి రాజంపేట టౌన్ బంగ్లా వీధిలో ఒక ఇల్లు బాడుగకు తీయించినాడు. అంతట A1 to A3 ముద్దాయిలు రాజంపేట టౌన్, ఓబులవారిపల్లి, మన్నూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి/పగలు కన్నపు నేరాలకు పాల్పడినారు.
అభినందనలు
ఈకేసులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రాజంపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి, ఏఎస్పీ, శ్రీ.మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ గారిని, మన్నూరు U/S పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యస్.కుళాయప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ యం.చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్ఐ పి.మహేష్, సిసిఎస్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి, పోలీసు సిబ్బందిని, అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు అభినందించారు.