రైతులందరికీ ఇళ్లల్లో ఇవాళ పండుగ రోజు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: జులై 30 రైతు రుణమాఫీతో తన జన్మధన్యం అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర మంతా రుణాల మాఫీతో పండగ వాతావరణం నెలకొందన్నారు.
లక్షన్నర రూపాయల వరకు రుణాలను మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ఓట్ల కోసమో.. ఎన్నికల కోసమో రైతు రుణమాఫీ చేయడం లేదని తెలిపారు. ఒకేసారి రైతుల కోసం 31వేల కోట్లు బ్యాంకులకు చెల్లించిన రికార్డు తమ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఈ రెండు నెలలు చరిత్రలో నిలిచి పోతాయని అన్నారు.
గతంలో అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోకూడదనేదే మా విధానం. అందుకే ఇవాళ రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేశాం.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లల్లో ఇవాళ పండుగ రోజు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశాం. రెండో విడతగా రూ.6,190 కోట్లు మాఫీ చేశాం అన్నారు.
రుణమాఫీ కింద సుమారు 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా రూ.6,190 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేశారు.
ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు జమ చేశారు.
రైతుల పక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వం
ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం
మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి
వెలి జర్ల గ్రామమలో రైతు వేదిక వద్ద, వెలి జర్ల జరిగిన రెండవ విడత రైతు రుణమాపీ వేడుకల లో పాల్గొన్న నేతలు
ఫరూక్ నగర్ మండల పరిధిలో వెలి జర్ల గ్రామమలో రైతు వేదిక వద్ద జరిగిన రైతుల రెండవ విడత రుణమాపీ సంబరాలలో పాల్గొన్న ..
ఫరూక్ నగర్ మండల తాజా మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి, మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏక కాలంలో రుణమాపీ చేస్తున్నందుకు రైతుల తరుపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి ధన్యవాదములు తెలిపారు అనంతరం రైతులతో కలిసి
సీఎం రేవంత్ రెడ్డి 2 వ విడత ఋణమపి కార్యక్రమాన్ని రైతు వేదికలో విడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రసంగాన్ని విన్నారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
అలాగే రైతులు ఆయిల్ పామ్ పంటలను సాగు చేసి అధిక దిగుబడి పొందాలి అని రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ సభ్యులు వాడ్యాల నర్సింహ్మ రెడ్డి,వెలిజర్ల కాంగ్రెస్ పార్టీ నేతలు గణేష్ గౌడ్,జాంగారి రవి, ఇరమొని రాజు ,
మధుసూదన్ రెడ్డి, మంద రాజు,కొండన్న గూడా గ్రామ నేతలు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి,
గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్, ఎస్సి సెల్ అధ్యక్షుడు నాగి సాయిలు, సక్రు నాయక్, హన్మంతు యాదవ్, విష్ణు, నర్సింహులు, భూపాల్ రెడ్డి వ్యవసాయ అధికారులు తేజ, ప్రియాంక,రైతులు పాల్గొన్నారు