నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జి.పుల్లారెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ వసుంధర , హెచ్ఎంచాంద్ బాష, ఫాస్టర్ రెవరెండ్ అనిల్ ఫాదర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతికి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్ పండుగ అని, భారతదేశం మతసామరస్యానికి ప్రతీకఅన్నారు. జీసస్ శాంతికి ప్రతిరూపమని అలాంటి వారి నుంచి అందరు తమకు చెడు చేసినా మంచిని పంచే తత్వా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలన్నారు. చిన్నారులు క్రీస్తు జనన రూపకమును చక్కగా ప్రదర్శించారు. చిన్నారులు మరియమ్మ, ఏసేపు, దేవదూతలు, జ్ఞానులు, హేరోజు రాజు, శ్యాస్తులు, గొల్లలు, క్రిస్మస్ ట్రీ తదితర వేషధారణలతో చిన్నారులను అలరించారు. అనంతరం కేక్ను కట్ చేసి చిన్నారులకుపంచి పెట్టారు. చిన్నారులు వేసిన పలు వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణ, ప్రవీణ్ కుమార్, ప్రవీణ్, భరత్, వలి, రంగస్వామి, దుర్గ, ఉపాధ్యాయినీలు లీలావతి, మేరీ, అక్కమ్మ, భారతి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.