- పచ్చని పాలమూరే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రులు ఉత్తం,జూపల్లి..
- ఒక్కరోజు పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమంలో మంత్రులు
TS ; దశాబ్దాలుగా వెనుకబడిన, వలసలకు పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు…
ఒకరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన, సమీక్షల నిమిత్తం ఆర్థిక, నీటిపారుదల ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రులు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను,కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లపూర్ రిజర్వయర్ ను సందర్శించారు.
▪️ముందుగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను తనిఖీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ….. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్ కు 45 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ,భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ల తో పాటు, కోయిల్ సాగర్ అన్ని ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు- రంగారెడ్డి పై 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఎకరాకు సైతం నీళ్లు ఇవ్వలేదని అన్నారు. పైగా పాలమూరు- రంగారెడ్డికి నీటి వాటాను సైతం సాధించలేకపోయారని తెలిపారు.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
పాలమూరు -రంగారెడ్డి పూర్తయితే 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, ఇదే చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఈ శాసనసభ కాలంలోనే పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను సైతం నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని, ఇందుకుగాను ఒక సమయాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఉదండాపూర్ తో పాటు, ఇతర రిజర్వాయర్లలో ముంపునకు గురైన వారికి న్యాయపరంగా పునరావాసం అందిస్తామని, వీటన్నిటిపై సమీక్షించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఉదండపూర్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్ కు 45 కోట్ల రూపాయలు విడుదల చేయటం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు,MLCలు,అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV