ఇసుక లిక్కర్ స్కామ్ లో త్వరలో అరెస్టులు : మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తిసుకపోతున్నడా
వైసిపి క్యాడర్ లో వణుకు పుట్టిస్తున్న మంత్రి నారా లోకేష్ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ ఇంకా వైసీపీ హయాంలో జరిగిన స్కాములు, దారుణాలపై చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్యాడర్ కు నారాలోకేశ్ సూటి సందేశం పంపించారు ఏపీలో త్వరలో లిక్కర్,ఇసుక స్కాముల్లో చాలా మంది అరెస్టు అవుతారని ప్రకటించారు.
రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని ఆయన చెబుతున్నారు. సంక్రాంతి సంబరాల కోసం.. నారా వారి పల్లె వచ్చిన ఆయన చంద్రగిరి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ ను పక్కన పెట్టలేదని.. దాని పని అది చేసుకుపోతుందన్నారు.
ఏపీలో గత ప్రభుత్వ హాయాంలో లిక్కర్, ఇసుక వ్యవహారం భారీ అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వం మారగానే ఈ అంశాల్లో విచారణకు సీఐడీని అదేశిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. సీఐడీ కేసులు నమోదు చేశారు. మైనింగ్ వ్యవహారంలో వెంకటరెడ్డి అనే అధికారిని అరెస్టు చేశారు కానీ ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇతర అరెస్టులు జరగలేదు. ఇందులో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి సహా చాలా మంది ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక లిక్కర్ స్కామ్ ను అతి పెద్ద దోపిడీగా టీడీపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం రాగానే లిక్కర్ పాలసీ మార్చి కేవలం జే బ్రాండ్స్ మాత్రమే అమ్మి వేల కోట్లు కాజేశారని ఆరోపిస్తున్నారు.
లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. సీఐడీ అంతర్గతంగా దర్యాప్తు చేస్తోంది. జే బ్రాండ్ల డిస్టిలరీల్లోనూ సోదాలు నిర్వహించారు. పలు సాక్ష్యాలు దొరికాయని.. ఆ జే బ్రాండ్లకు బినామీ ఓనర్లు వైసీపీ ముఖ్యనేతలేనని టీడీపీ అంటున్నారు. ఏపీబీసీఎల్ ఉన్నతాధికారిగా పని చేసిన వాసుదేవరెడ్డిని అరెస్టు చేసేందుకు సీఐడీ ప్రయత్నిస్తోంది.కానీ ఇంకా అరెస్టులు చేయలేదు. వ్యూహాత్మకంగానే ఇంకా అరెస్టులు చేయలేదని లేదని చెబుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ చంద్రగిరిలో ఈ కేసుల ప్రస్తావన తీసుకు రావడం ఆసక్తికరంగా మారింది.
మరో వైపు పార్టీ క్యాడర్ కు నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తామని నారా లోకేష్ తెలిపారు.పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరిస్తున్నామని దిగువ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామన్నారు. చంద్రగిరిలో నారా లోకేష్ ముఖ్య కార్యకర్తలతో అంతర్గతంగా సమావేశమయ్యారు. రాక్ష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున చక్కదిద్దడంపై ఇప్పటి వరకూ ఎక్కువ దృష్టి పెట్టామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read చెస్ లో నారా దేవన్స్ ప్రపంచ రికార్డు
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్