- కొన్ని ప్రాంతాల్లో షర్బత్, ఇంకొన్ని ప్రాంతాల్లో సుగంధ పాలుగా పేరు
- వేర్లను వెలికి తీసి ఉడికించి.. పానీయంగా మార్చి విక్రయం
- కొంతకాలంగా తగ్గిపోతున్న మొక్కలతో గిరిజనులకు ఉపాధి కరువు
- రాష్ట్రపతి దృష్టికి విషయం.. ప్రత్యేక చర్యలకు ఆదేశం
- ఫలితంగా ‘పీఎం వందన యోజన’ పథకం కింద పెంపకానికి ఏర్పాట్లు
- నంద్యాల జిల్లా కొత్తపల్లి, ఆత్మకూరులో ప్రత్యేక నర్సరీలు.
- ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు ప్రత్యేక శిక్షణ
నల్లమల అభయారణ్యంలో గిరిజనుల ఉపాధికి ఎంతగానో తోడ్పడుతున్న నన్నారి.. (షరబత్) మొక్కలు కనుమరుగవుతు న్నాయి. ఈ విషయం రాష్ట్రపతి దృష్టికి వెళ్ల డంతో నన్నారి పంటను ఎలాగైనా కాపా డాలని ఆమె అధికారులకు ఆదేశించారు. దీంతో కేంద్రం ప్రధానమంత్రి వందన యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టింది.
నల్లమల నన్నారి ఉపయోగాలు
- వేసవిలో దాహార్తి తీరుతుంది.
- శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది.
- మూత్ర సంబంధ సమస్యలకు మందుగా పని చేస్తుంది.
- వ్యాధి నిరోధకత పెంచుతుంది.
- ఆ హోర్మోన్ల సమతుల్యతను పెంపొందిస్తుంది.
- జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగేలా చేస్తుంది.
- శరీర బరువు నియంత్రణలో ఉండేలా ఉపకరిస్తుంది.
AP . Nadyala dt , ఆత్మకూరు: నల్లమల అంటేనే వృక్ష సంపదకు ప్రసిద్ధి. వివిధ వృక్ష జాతులు, ఔషధ మొక్కలకు పెట్టింది పేరు. అలాంటి ఈ అభయారణ్యంలో గరి జనులకు ఎంతగానో ఉపాధినిస్తున్న నన్నారి (షర బత్) మొక్కలు కనుమరుగవుతున్నాయి. గిరిజ నులు ప్రధానంగా సన్నారి, కుంకుడు, చింతపండు, ఇతర జిగురు లాంటి ఫల సేకరణ ద్వారా జీవ నోపాధి పొందుతున్నారు. అయితే నల్లమల అరణ్య పరిధిలో ఒకప్పుడు నన్నారి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా కనిపించేవి. గిరిజనులు వాటిని సేకరించి, విక్రయించగా వచ్చిన సొమ్ముతో జీవ నోపాధి ఉండేవారు.
ప్రస్తుతం నల్లమలలో వీటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం గిరిజనులు గూడెం దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లి నన్నారి తీగజాతి మొక్కను గుర్తించి, భూమిలో ఉన్న వేర్లను పెకిలించి తీసుకురావాల్సి వస్తోంది. ఎక్కువగా వేసవి సమీపించే ముందు గిరిజనులు నన్నారి వేర్ల సేకరణపై దృష్టి పెడతారు. కిలోల చొప్పున వాటిని విక్రయిస్తారు. వీటితో తయారైన నన్నారి పానీయాన్ని కొన్ని ప్రాంతాల్లో షర్బత్గా, మరికొన్ని ప్రాంతాల్లో సుగంధపాలుగా పిలుస్తారు. నన్నారి వేర్లు రెండు రకాలు, నలుపు, తెలుపు రంగుల్లో ఉం టాయి. నల్లమల పరిధిలో నల్ల రంగులో ఉన్నాయి. కేరళ, కర్ణాటకలోని మైసూరు, ఇతర రాష్ట్రాల్లో తెలుపు రంగులో దొరుకుతాయి. అయితే నల్లమ లలో దొరికే వాటికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నన్నారి చాలా రుచికరంగా ఉంటుంది. పోషక పదారాలు కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడి నన్నారి వేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.
పెంపకానికి కేంద్రం ప్రోత్సాహం
నల్లమల అటవీ పరిధిలో అంతరిస్తున్న నన్నారి. మొక్కలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీస్థాయిలో నన్నారి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. నల్లమల పరిధిలో నన్నారి మొక్కల జాతి అంతరిస్తోందన్న విషయం రాష్ట్రపతి దృష్టికి వెళ్లడం తో.. ఈ పంటను ఎలాగైనా కాపాడాలని ఆమె అధి కారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రధానమం త్రి వందన యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వార శ్రీశైలం ఐటీడీఏ అధ్వ ర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో తొలిసారిగా నన్నారి మొక్కల పెంపకానికి ఐటీడీఏ అధికారులు సన్నద్ధ మయ్యారు.
ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని కొత్తప ళ్లి, ఆత్మకూరు గ్రామాల్లో గిరిజనుల ఆధ్వర్యంలో నన్నారి మొక్కల పెంపకాన్ని (నర్సరీ) ప్రారంభిం చారు. మొక్క నాటిన రెండేళ్లలో భూమిలోకి వేర్లు బలంగా దిగుతాయి. ఆ తర్వాత వాటిని బయటకు పెకలించి, శుభ్రం చేసి విక్రయిస్తారు. కిలో నన్నారి పేర్లను ఉడికించడం ద్వారా 25 లీటర్ల సన్నారిని తయారు చేయవచ్చు. లీటర్ రూ.130 నుంచి రూ.200 చొప్పున మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక లీటర్ నన్నారికి.. సోడా లేదా నీరు, కాస్త నిమ్మ రసం కలపడం ద్వారా 20 గ్లాసుల పానీయం. తయారవుతుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల నుంచి నన్నారి వేర్లను సేకరించి, రాష్ట్రంలోని వైజాగ్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
షుగర్ ఫ్రీ నన్నారి
నన్నారి అంటేనే రుచికి ప్రతీక. పిల్లలైనా, పెద్దలైనా నన్నారికి దాసోహమే. అలాంటి నన్నారిని చూసిన షుగర్ పేషెంట్లు ఎలాగైనా సరే తాగాలని ఉబలాట పడతారు. అయితే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందని కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుంటారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా సేవించాలా ఐటీడీఏ ఆధ్వర్యంలో నన్నారి తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఆత్మకూరు ప్రాంతంలోని చెంచు, గిరిజనులకు శిక్షణ సైతం ఇచ్చాడు. మొక్కల నర్సరీ కూడా. ప్రారంభించారు. ఒక్కొక్క గ్రూపు నందు 30 మంది చొప్పున. చెంచు గిరిజనులు ఉండేలా గ్రూపులను ఏర్పాటు చేశారు.
నన్నారి పెంపకం వల్ల ఆర్థికంగా లబ్ధి.. శివలింగమ్మ, చెందు మహిళ, ఎర్రమఠం గూడెం
ఎండాకాలం వచ్చిందంటే నన్నారి గడ్డల కోసం పారా, పలుగు పట్టుకుని కొం డల్లోకి వెళ్లాలి. ఆ మొక్క కనిపించేంత వరకు వెతికి వెతికి కొండల వెంబడి తిర గాలి. మొక్క కనిపించకపోతే ఇంటికి రావాలి. ఆ మొక్క కనిపిస్తే గడ్డలను తీసుకుని రావాలి. ఇందుకు కొండలో తిరిగేందుకు కూడా పొద్దు పోతుంది. ప్రస్తుతం మొక్కలను ప్రభుత్వం గూడేల్లోనే ఏర్పాటు చేయడంతో మాకు కొండల వెంట తిరిగే ఇబ్బంది ఉండదు. ఆ గడ్డలను అమ్ముకుని జీవనం సాగిస్తాం. గడ్డలు ఎక్కువగా వస్తే ఆర్థికంగా ఎదుగుతాం.
తిరిగే కష్టం తప్పుతుంది ..ఈదమ్మ, బైర్లూటీ గూడెం
ఐటీడీఏ ఆధ్వర్యంలో మా గూడేల్లో నున్నాది నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డలను అమ్ముకుని బతికే అవకాశం పెరుగుతుంది. తద్వారా మాకు ఎంతగానో ఆర్థికంగా ఉపయోగం ఉంటుంది. లేదంటే కొండల వెంట తిరిగి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడచి వెతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ముగి సిన తర్వాత ఈ గడ్డల కోసం ఎంతో దూరం వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గూడెం దగ్గర లోనే నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు జీవనోపాధి లభిస్తుంది.
Also Read చెస్ లో నారా దేవన్స్ ప్రపంచ రికార్డు
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్