నంద్యాల జిల్లా ప్రజలకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు పోలీసు డిపార్ట్మెంట్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు…..
డిసెంబరు 31 వ తేది రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నంద్యాల పోలీస్ వారు చేయు సూచనలు……
కొత్తసంవత్సరం వేడుకల సందర్బంగా హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు ……
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు
01) కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి .
02) డిసెంబర్ 31 వ తేది రాత్రి నంద్యాల జిల్లా లో అన్నీ పోలీసు స్టేషన్ పరిదులలో పోలీసు పెట్రోలింగ్ ఉంటుంది .
03) యువకులకు వారి తల్లిదండ్రులు సత్రవర్తనతో మెలగాలని సూచించండి.
04) నూతన సంవత్సర వేడుకలను నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి.
05) ఎక్కడా ఎలాంటి ఘటనలకు తావులేకుండా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోండి..
06) నిబంధనల మేరకు డిసెంబర్ 31 వ తేది రాత్రి మద్యము షాపులు, హోటళ్లు, దుకాణాలు సమయాల్లోనే ఖచ్చితంగా మూసేయాలి.
07) రహదారులపై కేక్ కటింగ్ లు చేయడం నిషేధం.
08) మద్యంకు అనుమతి లేని ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించినా, అందుకు ఏర్పాట్లు సమకూర్చినా చట్టపరంగా చర్యలు తప్పవు.
10) మద్యం మత్తులో వాహనాలు నడపటమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెడితే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు.
11) బైక్ రేస్ లు, త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవడము జరుగును.
12) నిభందాలు అతిక్రమించి వాహనాలు నడిపిన వారి వాహనాలు సీజ్ చేయబడతాయి.
13) ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.
14) జిల్లాలో గుంపులు గుంపులుగా కేకలు వేస్తూ తిరుగుతూ ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుంది.
నంద్యాల జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందరూ పోలీసు శాఖతో సహకరించాలి.