విధులలో ప్రతిభ కనబరచిన పోలీసులకు అవార్డులు

www-politicalhunter-com-1.jpg

కర్నూలు జిల్లా ప్రజలకు , సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పిన… కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ. విధులలో ప్రతిభ కనబరచిన పోలీసులకు అవార్డులు

కర్నూలు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కర్నూలు పోలీసు వార్షిక పనితీరు రిపోర్టు గురించి అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథులుగా హజరై , మాట్లాడారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..సిబ్బందిని ఎంకరేజ్ చేస్తే క్రైమ్ రేటు తగ్గుతుందన్నారు. బాధ్యత పెరుగుతుందన్నారు. మొబైల్ ఫోనులను రికవరీ చేయడంతో దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటారనే భయం తో కూడా క్రైమ్ రేటు తగ్గుతుందన్నారు.ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉన్నామంటే పోలీసులేనని, కష్టం వచ్చినప్పుడు కుడా గుర్తుకు వచ్చేది పోలీసులేనన్నారు. పోలీసుల సేవలను గుర్తిస్తామన్నారు. పోలీసులు 2022 లో చాలా బాగా పని చేశారన్నారు. కష్టం వస్తనే దేవుడు, పోలీసులు గుర్తుకు వస్తారన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు బాగా కృషి చేస్తున్నారన్నారు. జిల్లా ప్రథాన న్యాయమూర్తి మాట్లాడుతూ అందరి సహాకారం అవసరమన్నారు. కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగా ఉంటే కేసులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం కర్నూలు జ్యూడిషీయరీ 7 వ ర్యాంకులో ఉందన్నారు. వచ్చే సంవత్సరం 3 స్ధానానికి తీసుకెళ్లే విధంగా అందరూ సహాకరించాలన్నారు. కర్నూలు పోలీసు లోగో చాలా బాగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2022 సంవత్సరంలో 22 వేలు ఉన్న పెండింగ్ కేసులను 2 వేల 3 వందలకు తీసుకువచ్చామన్నారు. ఈ కేసులను తగ్గించడానికి న్యాయశాఖ సహాకారం ఉందన్నారు. నాటుసారా పై ప్రత్యేక దృషి సారించామన్నారు. జిల్లాలో నాటుసారా కాసే 57 గ్రామాలు ఉండేవన్నారు. ఈ సంవత్సరం కేవలం 4 గ్రామాలకు పరిమితం చేసే విధంగా తీసుకువచ్చామన్నారు. కలెక్టర్ ఉత్తర్వులతో 12 మంది పై పిడి యాక్టులు నమోదు చేశామన్నారు. మొబైల్ రీకవరీ కి ఇంతకు ముందు ఏలాంటి రెస్పాన్స్ ఉండేది కాదన్నారు. 3 నెలల్లోనే టెక్నికల్ టీం ఏర్పాటు చేసి 2500 మంది బాధితులు పొగొట్టుకున్న సెల్ ఫోన్లు పొందే విధంగా కృషి చేశామన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ పని తీరు కనబరచిన పోలీసులకు జిల్లా కలెక్టర్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ అవార్డులు అందజేశారు.

బెస్ట్ పార్మెన్స్ అవార్డ్స్ అందుకున్న వారిలో 1) సాంకేతిక ఆధారాలతో కున్నూరు మర్డర్ కేసులో నిందితుడి అరెస్టుకు తగిన సమాచారాన్ని సేకరించిన కోడుమూరు పిఎస్ చెందిన కానిస్టేబుల్ కె. రామకృష్ణ కు. 2) 240 యుఐ కేసులు మరియు పిటి కేసులను లోక్ అదాలత్ పరిష్కరించడంలో కృషి చేసినందుకు కర్నూలు తాలుకా పిఎస్ కానిస్టేబుల్ ఎమ్ . కృష్ణకు. 3) 84 లక్షల విలువ గల ప్రాపర్టీని రికవరీ కి కృషి చేసినందుకు ఆదోని ఒన్ టౌన్ పిఎస్ చెందిన కానిస్టేబుల్ హాజీభాషాకు, 4) సెక్యూరిటి వింగ్ ఆపరేషన్స్ లలో అత్యుత్తమ పని తీరుకు ఎఆర్ ఆర్ ఎస్సై ఎస్. సత్తార్ కు, 5) జూనియర్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ గా 50 చార్జీ షీట్ల ను పూర్తి చేసినందుకు కర్నూలు తాలుకా పిఎస్ కు చెందిన ఎస్ . కరీం భాషా కు, 6) ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ లో బాగా చేసినందుకు కర్నూలు ట్రాఫిక్ పిఎస్ ఎస్సై జి. మల్లికార్జునకు. 7) సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంలో ఓర్వకల్ ఎస్సై ఎన్. సి మల్లికార్జున కు, 8) యుఐ కేసులు తగ్గించడంలో చేసిన కృషి కి హాలహార్వి ఎస్సై వై. విజయ్ కుమార్ కు. 9) పిడి యాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ లో బాగా చేసినందుకు ఆదోని త్రీ టౌన్ సిఐ శ్రీరామ్ కు, 10) లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో చేసిన కృషి కి కర్నూలు తాలుకా సిఐ శేషయ్య కు బెస్ట్ పార్మెన్స్ అవార్డ్స్ అందజేశారు. 11) ఓవరాల్ బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డు ను ఆదోని ఒన్ టౌన్ సిఐ విక్రమ సింహాకు 12) కర్నూలు టు టౌన్ పియస్ ను బెస్ట్ పోలీసుస్టేషన్ గా గుర్తించి కర్నూలు టు టౌన్ సిఐ వి. శ్రీనివాసులుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు, డిఆర్ ఓ నాగేశ్వరరావు, ఫోరెన్సిక్ విభాగం హెచ్ ఓడి డాక్టర్ సాయి సుధీర్ , డిప్యూటి డైరెక్టర్ ప్రాసిక్యూషన్ అజకల్ , డివై. రవాణా కమిషనర్ రమేష్ అసిస్టెంట్ డిఎం అండ్ హెచ్ ఓ బి.భాస్కర్, అడాల్ సీనియర్ సివిల్ జడ్జి పి.దివాకర్ , అడిషనల్ ఎస్పీలు ప్రసాద్, నాగబాబు, డిఎస్పీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top