పత్రికా ప్రకటన
నంద్యాల జిల్లా
31-05-2025
పదవి వీరమణ పొందిన పోలీసులను సన్మానించిన ….. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు.
నేడు నంద్యాల జిల్లాలో రిటైర్మెంట్ కాబడిన పోలీసులకు నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పనిచేసి పోలీసు సిబ్బంది పదవి వీరమణ పొందడం అభినందనీయమని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు తెలిపారు.
నేడు పదవి విరమణ పొందిన వారి వివరాలు
1) K. లక్ష్మయ్య
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ PS నంద్యాల.
లక్ష్మయ్య గారు 1987లో మొదటగా పోలీస్ శాఖలో తన ప్రయాణాన్ని ప్రారంభించి నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ టౌన్, నంద్యాల టూ టౌన్, నంద్యాల ట్రాఫిక్, బనగానపల్లి, రేవనూరు,గోస్పాడు మొదలగు పోలీస్ స్టేషన్లలో పనిచేయడం జరిగింది. ఇప్పటివరకు సుమారు 38 సంవత్సరాలు పోలీసు శాఖకు సేవలందించడం జరిగింది.
2) O. శంకర్ రావు
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
DCRB నంద్యాల.
శంకర్ రావు గారు 1989లో మొదటగా పోలీస్ శాఖలో తన ప్రయాణాన్ని ప్రారంభించి నంద్యాల తాలూకా, పాములపాడు, చాగలమర్రి,డోన్ టౌన్,ఎన్ రాచర్ల ,అవుకు, కొలిమిగుండ్ల మొదలగు పోలీస్ స్టేషన్ లలో పనిచేయడం జరిగింది. ఇప్పటివరకు సుమారు 36 సంవత్సరాలు పోలీసు శాఖకు సేవలందించడం జరిగింది.
3) M. జగన్మోహన్ రెడ్డి
ఆర్ముడు రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్.
జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా 1983 లో పోలీసు శాఖలో తన ప్రయాణాన్ని ప్రారంభించి సుమారు 42 సంవత్సరాలు పోలీస్ శాఖకు సేవలందించడం జరిగింది.
సుదీర్ఘకాలం తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పోలీసు శాఖకు సేవలందించడం ఎంతో గర్వంగా ఉందని,మీరందరూ కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నన్ను సంప్రదించవచ్చని ఎస్పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు జిల్లా సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చంద్రబాబు గారు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం నంద్యాల