నందవరం చౌడేశ్వరి అమ్మవారి క్షేత్రంలో కన్నుల పండువుగా జరుతున్న శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు.
- చౌడేశ్వరి అమ్మవారికి విశేష అభిషేక పూజలు నిర్వహిస్తున్న అర్చకులు.
- కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన చౌడేశ్వరి అమ్మవారు.
- పల్లకి రథంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం గర్భాలయ ప్రదక్షణం.
- పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ప్రసిద్ధి చెందిన నందవరం
శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ క్షేత్రంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవ వేడుకల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీప కాంతులతో అలంకరించడం తో అమ్మవారి ఆలయ క్షేత్రం దేదీప్య మానంగా వెలిగిపోతుంది.
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇంటి ఇలవేల్పు అమ్మగా పూజించే శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని ప్రతి నిత్యం ఒక ప్రత్యేక అలంకరణలతో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేపడుతున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో,మంగళ వాయిద్యాలతో సాంప్రదాయ బద్ధంగా అమ్మవారి ఆలయ క్షేత్రంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు, ప్రతినిత్యం గణపతి పూజ, పుణ్యాహ వాచన, పంచామృత అభిషేకం,సహస్రనామ కుంకుమార్చన, మహా మంగళహారతి వంటి విశేష అభిషేక పూజా క్రతువులను అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
గత ఆరు రోజుల క్రితం కన్నుల పండుగగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా, శైల పుత్రి అలంకారం, బ్రహ్మచారిని అలంకారం ,చంద్ర ఘంటా అలంకారం, కూష్మాండ అలంకారం, స్కంద మాత అలంకారం, కాత్యాయిని అలంకారాలతో శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని సర్వాంగ సుందర మైన ప్రత్యేక అలంకరణలతో ,అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి రథంలో కొలువు తీర్చి , చౌడేశ్వరి అమ్మవారి నామస్మరణ చేస్తూ పల్లకి రథాన్ని గర్భాలయం చుట్టూ ప్రదక్షణం చేపించారు.
చౌడేశ్వరి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలు, ప్రతినిత్యం ఓ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటూ కన్నుల పండుగ కొనసాగుతుండడంతో అమ్మవారిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చు కుంటుండటం తో నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ క్షేత్రం, ప్రత్యేక శోభ తో భక్తుల సందడి తో కళ కళ లాడుతోంది.