- ఏసీబీ వలలో మిషన్ భగీరథ డీఈఈ
- సినిమా స్టైల్లో 10 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
- సూర్యాపేట జిల్లాలో మిషన్ భగీరథ డీఈఈగా పని చేస్తూ, కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇస్లావత్ వినోద్
- నారాయణపేట జిల్లా మక్తల్ లో ఏఈగా పని చేసి, గత ఏడాది బదిలీపై డీఈఈగా సూర్యాపేటకు వచ్చిన ఇస్లావత్ వినోద్
- మక్తల్ లో పనిచేసినప్పుడు ఎంబీ (మెజర్మెంట్ బుక్) రాసేందుకు కాంట్రాక్టర్ వద్ద రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేసిన వినోద్
- సూర్యాపేటకు బదిలీ అయినప్పటికీ ఎంబీని తన వద్దే పెట్టుకుని, లంచం ఇస్తేనే పని చేస్తానని తేల్చి చెప్పిన వినోద్
- దిక్కుతోచని స్థితిలో ఏసీబీని ఆశ్రయించగా, అధికారుల సూచన మేరకు లంచం ఇస్తానని ఒప్పుకున్న కాంట్రాక్టర్
- సూర్యాపేటలోని కోదాడ బైపాస్ రోడ్డులో ఉన్న ఫుడ్ కోర్టు వద్ద డబ్బులు ఇస్తానని చెప్పడంతో, కారులో వచ్చి కాంట్రాక్టర్ ను ఎక్కించుకొని తీసుకెళ్లిన వినోద్
- ఏసీబీ అధికారులను గమనించి కాంట్రాక్టర్ ను కారు నుండి దింపేసి డబ్బుతో పారిపోయిన వినోద్
- దాదాపు 10 కిలోమీటర్లు వెంబడించి, వినోద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఏసీబీ వలలో మిషన్ భగీరథ డీఈఈ

Mission Bhagiratha DEE in the net of ACB