- నల్లమల అడవులో…పెద్దపులి, చిరుత పులుల.. మనుగడ ప్రశ్నార్థాకం
- రోడ్డు ప్రమాదాలలో మృతుఘోష పడుతున్న చిరుత పులులు
- ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో వరుసగా వన్యప్రానులు విలవిల
- దాహర్తీ తీర్చుకునేందుకు జనసంచారంలోకి వన్యప్రానులు
- తల్లిపులి ఆచూకి కనుమరుగైన రోజు నుంచి ఈనాటి వరకు మృత్యుఘోషనే..
- నాగార్జునసాగర్, శ్రీశైలం, గుండ్లబ్రమేశ్వర ప్రాంతాలలో ఉచ్చులతో వేట
- మళ్లీ మొదలైన నాటుతుపాకులతో వన్యప్రానుల వేట..!?
Article by ———- సగినాల రవి కుమార్ – 8309888954
శ్రీశైలం, నాగార్జునసాగర్ పెద్ద పులలు అభయారణ్యానికి నిలయంగా గాంచిన నల్లమల అడవులో పెద్దపులి, చిరుతు పులుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. వేసవి కాలంలో వన్యప్రానులు దాహర్తీనీ తీర్చుకునేందుకు అడవి సమీపంలోని గ్రామీణ ప్రాంతాలలో జనసంచారంలోకి వన్యప్రానులు వెళ్తూన్నట్లు గ్రామీణ ప్రాంతా ప్రజల సమాచారం. ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ లో వరుసగా వన్యప్రానులు మృత్యువాత పడుతూ రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన వన్యప్రానుల మృతికి కారణాలైన వాహనాలను సీజ్ చేశారా. లేక చట్టాలను నిర్వర్యం చేస్తూ చేతులు దులుపుకుంటున్న అటవీశాఖ అధికారుల తీరుపై .. ప్రత్యేక కథనం.
జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జునస్వామి ఆశీస్సుల కోసం భక్తాదులు దేశంలో నలుమూలాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరుచుగా వస్తునే ఉంటారు. వన్యప్రానులు రాత్రివేళ సమయంలో అధికంగా రోడ్డు దాడుతూ వెళ్తూంటాయి. అటవీశాఖ అధికారులు ఎన్ని నిబందనలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అటవీశాక అధికారులు సూచించిన బోర్డులపై అవగాహన లేని వాహనదారులు వన్యప్రానులతో మృత్యుఘోష కనిపిస్తునే ఉంది. వరుసగా రెండు రోజులలో మూడు వన్యప్రానులు మృతి చెందిన సంఘటన రెండు డివిజన్లలో చోటు చేసుకుంది. నాగార్జునసాగర్, టైజర్ రిజర్వు పరిధిలోని మార్కాపురం డివిజన్ పరిధిలోని రోడ్డు ప్రమాదాలలో అనుకొని సంఘటనలతో వన్యప్రానులు మృత్యువాత పడుతునే ఉన్నాయి.
గత శుక్రవారం రాత్రి సమయంలో ఓ చిరుత పులి పిల్ల శ్రీశైలం సమీపంలో డీ కొట్టి మృత్యువాత పడింది. ఆత్మకూరు వన్యప్రాని అటవీ డివిజన్ పరిధిలోని వెలుగోడు రేంజ్లోని నంద్యాల ఆత్మకూరు ప్రధాన జాతీయ రహదారిపై పక్కల రెండు దుప్పులు ప్రమాదంలో మృతి చెందిన్నట్లు అధికారులు గుర్తించారు. వన్యప్రానుల సంరక్షణ నల్లమల అటవీ ప్రాంతంలో గాలిలో దీపంల మారిందని వన్యప్రాణి ప్రేమికులు వాపోతున్నారు. ప్రస్తుతం అటవీ డివిజన్లో ఒకవైపు నాటు తుపాకులతో వన్యప్రానులను వేటాడుడు మరో వైపు రోడ్డు ప్రమాదాలలో అత్యదికంగా వన్యప్రానులు మృతి చెందుతునే ఉన్నాయి.
అటవీశాఖ అధికారులు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి రాత్రివేళ సమయంలో దోర్నాల నుంచి శ్రీశైలం వరకు వాహనదారులకు అవగాహాన కల్పించే విదంగా మొబైల్ అటవీశాఖ వాహానంను ఏర్పాటు చేసుకుంటే వన్యప్రానులను సంరక్షణ చేసుకోవచ్చని వన్యప్రాని ప్రేమికులు వాపోతున్నారు. డివిజన్లో తరుచుగా ఏదో ఒక సంఘటనలో వన్యప్రానులు మృత్యుఘోష పడుతున్నాయి.
వన్యప్రానుల సంరక్షణకు పెనుముప్పు
కర్నూలు – అమరావతి జాతీయ రహదారిపై అత్యదిక ప్రమాదాలతో వాహనదారుల నుంచి ఎన్నో వన్యప్రానులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహాదారిలో కూడా వన్యప్రానుల సంరక్షణకు పెనుముప్పుగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రానులపై గుర్తు తెలియని వాహనాలు డీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందుతున్నాయి. అటవీశాఖ అధికారుల నిబందనల మేరకు పెద్ద పులలు అభయారణ్యంలో చిరుత పులులు, పెద్ద పులులు ఇతర వన్యప్రానులు రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన సంఘటనలు అందరిని కలచి వేస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాల క్రితం NSTR పరిధిలోని మహనంది అటవీ ప్రాంతంలో రైలు మార్గంలో ఎన్నో వన్యప్రానులు మృతి చెందిన గణంకాలు అటవీశాఖ అధికారులకు తెలసిన విషయమే. ముఖ్యంగా జాతీయ రహదారి కావడంతో..వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం మరో వైపు కార్తీక మాసం ప్రారంబోత్సం కాబోతున్న నేపథ్యంలో ఇంకా రోడ్డు ప్రమాదాలలో ఎన్ని వన్యప్రానులు గుర్తు
తెలియని వాహనాలతో మృత్యువాత పడుతాయో వేచిచూడాల్సి ఉంటుంది. పర్యావరణం వన్యప్రాని
సంరక్షణ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ పర్యావరణ ప్రేమికులు అటవీశాఖ అధికారులకు
వనపాణుల సంరకణపై జాగ్రతలు తీసుకోవడంలో ముందుండాలని తెలియజేసున్నారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV