“కబ్జాదారుల కన్ను.. వృద్ధ దంపతుల కన్నీరు!”
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కబ్జాదారుల అరాచకం మరోసారి బయటపడింది. వయస్సు మీద పడిన వృద్ధ దంపతుల స్థలంపై బడాబాబుల కన్ను పడింది. ఎమ్మిగనూరుకు చెందిన కె. నారాయణ దంపతుల, మిలిటరీ కాలనీలో 30 సంవత్సరాల కిందట 6 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. తమ శక్తి మేరకు ఆ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ స్థలంపై కొందరు బడా బాబులు కన్నేశారు. అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ స్థలంలో ఉన్న బండలను తొలగిస్తూ కబ్జాకు ప్రయత్నించిన సమయంలో వృద్ధ దంపతులు అడ్డుకున్నారు. కానీ వారి వయస్సుని కూడా లెక్కచేయకుండా…ఆ వృద్ధ మహిళను పక్కకు నెట్టి బండలను బలవంతంగా తీసేశారు. బండలను తీస్తున్న సమయంలో…ఆ వృద్ధ మహిళ “మమ్మల్ని వదిలేయండి… మా స్థలం మాకే వదిలేయండి” అంటూ బ్రతిమిలాడింది. కానీ ఆమె కన్నీళ్లకు కూడా కనికరం చూపలేదు. ఈ దృశ్యాలు అక్కడున్న వారందరినీ కలచివేశాయి.
ఈ ఘటనపై వృద్ధ దంపతులు సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని “మాకు న్యాయం చేయాలని వీడియ ద్వారా వేడుకున్నారు. “మీరు మమ్మల్ని ఆదుకోకపోతే…ఈ దౌర్జన్యాల మధ్య బతకడం కన్నా చావడమే మేలని…” చేతులెత్తి ప్రార్థిస్తున్నారు ఈ వృద్ధులు.
Read Morehttps://politicalhunter.com/african-swinefever-wildboars-die/











