ఏపీ ముఖ్యమంత్రి వర్యులు,జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని.. బనగానపల్లె పట్టణం మండల అభివృద్ధి కార్యాలయ అవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన..బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, డోన్ ఫారెస్ట్ రేంజర్ ప్రవీణ్ కుమార్,మండల అభివృద్ధి అధికారి శివ రామయ్య,మండల తహశీల్దార్ రామకృష్ణ, అధికారులు….
మనిషి కి జన్మనిచ్చినది అమ్మ అయితే…..
మరోజన్మ నిచ్చేది స్వచ్ఛ మైన గాలి….
అందుకే మొక్కలు నాటాలి……..
రాబోయే తరాల వారిని ఆరోగ్య వంతులుగా ఉంచాలంటే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి……
కొంతమంది అక్రమంగా చెట్లను నరికి మనల్ని మనమే ఆయుష్షును తగ్గిస్తున్నారు…..
బనగానపల్లె పట్టణం మండల పరిషత్ కార్యాలయం అవరణం లో మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం ను పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు సేవా,సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగానే మొదటి రోజు క్రీడా పోటీలు,రెండవ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందని చెప్పారు.
మనకు జన్మనిచ్చిన వారు తల్లి అయితే మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి చెట్లు అవసరం అని అలాంటి చెట్లను కొంత మంది అక్రమంగా రాత్రులు చెట్ల మీద యాసిడ్ వేయడం,మరికొంతమంది చెట్ల మొదుల్ల వద్ద మంటలు పెట్టీ చెట్లను కొట్టివేయడం జరుగుతుంది అని అయితే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే ఉండదు అని చెప్పారు.
మనం ఆరోగ్యంగా ఉండాలని మొక్కల ను పెంచడమే ఒక్కటే మార్గం అని చెప్పారు.కాబట్టి ఇండ్ల ముందర స్థలం వుంటే ఖచ్చితంగా మొక్కలను పెంచడానికి ఫారెస్ట్ శాఖ వారు ఉచితంగా మొక్కలను అందించడం జరుగుతుంది అని దీన్ని బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమం లో జిల్లా వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి,మండల అభివృద్ధి అధికారి శివ రామయ్య,మండల తహశీల్దార్ రామకృష్ణ,గ్రామ పంచాయతీ కార్యనిర్వహణ అధికారి ఖలీల్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హైమవతి,నందివర్గం ఎస్సై రామాంజనేయ రెడ్డి,APNRGS రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుల్లారెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు బండి బ్రంహనంద రెడ్డి, ఎర్రగుడి సుబ్బారెడ్డి, యనకండ్ల సుబ్బరాయుడు, చౌడయ్య,నాయకులు,కార్యకర్తలు,గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.