- భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..
- బాదుడే బాదుడు నానుడిని పక్క
- అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం..
- రాష్ట్ర ప్రజలలో ఆగ్రహ జ్వాలలు..
నవంబర్ 30 : ఏపీలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పెంపు రెండో సారి, డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ తాజాగా ఆమోదం తెలిపింది. డిసెంబర్ నెల నుంచి వినియోగదారుల పైన రూ. 9,412 కోట్ల మేర భారం పడనుంది. సర్దుబాటు చార్జీలను యూనిట్కు 92 పైసలు చొప్పున 2026 నవంబరు వరకూ వసూలు చేయనున్నారు. తాజా నిర్ణయంతో వినియోగదారుల పై మరింత భారం పడనుంది.
విద్యుత్ ఛార్జీల బాదుడు
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచ బోమని ప్రజలకు వాగ్ధానాలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం . నమ్మిన ప్రజలను నట్టేట ముంచింది ఏపీలో విద్యుత్ వినియోగదారుల పై మరింత భారం మోపే నిర్ణయం వెలువడింది. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీలతో పాటు రెండు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్పిపిసిఎ) ఛార్జీలతో నడ్డివిరుస్తున్న విద్యుత్ సంస్థలు మరోసారి భారం మోపుతున్నాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్ర ణ మండలి అనుమతి లభించింది. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ఛార్జీల పెంపుకు సంబంధిం చిఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.12,844 కోట్లు సర్దుబాటు చేసేందుకు ఈఆర్సీకి డిస్కం లు ప్రతిపాదనలు పంపాయి.
ఈఆర్సీ అనుమతితో..
అందులో రూ.3,432 కోట్లుకు కోత విధించిన ఈఆర్సీ మిగిలిన రూ.7,912 కోట్లు (వ్యవసాయ సబ్సిడీ రూ.1,500 కోట్లు పోను) ప్రజల నుంచి వసూలు చేసుకొనేందుకు ఆమోదం తెలిపింది. తాజాగా అనుమతి రావటంతో ఇక, ఈ సర్దుబాటు చార్జీలను యూనిట్ కు 92పైసలు చొప్పున వచ్చే నెల (డిసెంబరు) నుంచి 2026 నవంబరు వరకూ వసూలు చేయాలని డిస్కం లకు ఈఆర్సీ సూచించింది. ఈఆర్సీ అనుమత మేరకు డిస్కంలు ప్రతినెలా 40 పైనలు చొప్పున రూ.2,868.90 కోట్లు డిస్కంలు వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేశాయి.
పెంపు ఎక్కడ ఎంత..
మిగిలిన రూ.6,543.60 కోట్లను వచ్చే డిసెంబర్ నుంచి 2026 నవంబర్ వరకూ వసూలు చేసుకోవాలని ఈఆర్సీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఏపీఎనీ పీడీసీఎల్) పరిధిలో యూనిట్కు 0.9132 పైసలు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో 0.9239 పైసలు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్) పరిధిలో 0.9049 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఆరు నెలల కాలంలో ప్రజల పైన వరుసగా రెండో సారి ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ భారం మోపటం పైన రాష్ట్ర ప్రజలలో అగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్