నంద్యాల జిల్లా.. బనగానపల్లె టిడిపి నియోజకవర్గంలో కక్ష్య సాధింపు చర్యలు

బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులపై ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనముల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరిగింది. తుమ్మలపెంట గ్రామానికి ట్రాఫిక్ సమస్య వల్ల రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిధులతో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి తుమ్మలపెంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వర్ రెడ్డి పనులు ప్రారంభించడం జరిగింది. రోడ్లు భవనంలో శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుమతి లేకుండా రోడ్డు పనులు మొదలు పెట్టడం జీర్ణించుకోలేక రోడ్లు భవనంలో శాఖ అధికారులతో అధికారుల అనుమతి లేకుండా పనులు చేస్తున్నారని నెపంతో అల్ట్రాటెక్ యాజమాన్యం మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మీద అధికారులతో పోలీస్ కేసు నమోదు చేయించడం జరిగింది.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బరి తెగింపు..!
బనగానపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తరలింపున బీసీ జనార్దన్ రెడ్డి కి మంత్రి పదవి రావడంతో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బనగానపల్లె నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు తుమ్మలపెంట గ్రామానికి సందర్శించి రోడ్డు పనులను పరిశీలించి కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు నమోదైన వైయస్సార్ పార్టీ నాయకులను భరోసా కల్పించడం జరిగింది.
ఖండించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి..

ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రజల అధికారం ఇస్తే అభివృద్ధి చేయాల్సింది పోయి కేవలం వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరుల మీద దాడులు చేయడం వారిని కక్ష సాధింపు చర్యలతో కేసులు నమోదు చేయించడం జరుగుతుందని అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మాత్రం తాను ఉపేక్షించేది లేదంటూ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు.