మరో పరువు హత్య – కూతురుని ప్రేమించాడని గొడ్డలితో నరికి చంపిన తండ్రి..!

Honor killing in Muppiri Thota village

Honor killing in Muppiri Thota village

రోజు రోజు కి మనిషి ఒక మృగం లాగా తయారు అవుతున్నారు…… క్షణికావేశంతో ప్రాణాలు తీస్తున్న ఘటన….మరో పరువు హత్య..తన కూతుర్ని ప్రేమించాడని గొడ్డలితో నరికి చంపిన తండ్రి..!

తెలంగాణ … పెద్దపల్లి జిల్లా

ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరు కులాలు వేరు..

వేరు కావడంతో ప్రేమకు అడ్డు చెప్పాడు యువతి తండ్రి.. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయికుమార్ ను హెచ్చరించాడు.

కానీ.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయాడు..అమ్మాయి తండ్రి

ఎలాగైనా ప్రియుడిని చంపాలని అమ్మాయి తండ్రి అనుకున్నాడు.. దీనికోసం ఓ పథకాన్ని రచించి దాన్ని అమలు చేశాడు

క్రమంలో గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కూర్చుని వారితో మాట్లాడుతున్నాడు.. ఈ సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు.. అనంతరం ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్‌పై దాడి చేశాడు.. దీంతో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతని స్నేహితులు, కుటుంబసభ్యులు.. సాయికుమార్ ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ వైద్యం అందిస్తుండగానే సాయికుమార్ మృతి చెందాడు.

అయితే, సాయికుమార్ పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే..గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Honor killing in Muppiri Thota village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top