షాద్ నగర్ లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Fake cotton seeds seized in Shadnagar

Fake cotton seeds seized in Shadnagar

  • షాద్ నగర్ లో రూ.7.5 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో రూ.7.5 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నమ్మదగ్గ సమాచారం మేరకు మేడ్చల్ ఎస్ఓటి ఎస్సై ధనుంజయ, స్థానిక ఎస్సై శరత్, వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ ఏడి నిశాంత్ కుమార్ సంయుక్తంగా షాద్ నగర్ పరిగి రోడ్డు బకర్మన్ గార్డెన్ ఆపోజిట్ లోని ఖాళీ స్థలం దగ్గర నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం అందింది. అక్కడ ఆపి ఉన్న హోండా మొబిలియో ఏపీ 03 బిఏల్ 5204 నంబరు గల వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 300 కిలోల నిషేధించిన పత్తి విత్తనాలను గుర్తించడం జరిగిందనీ వ్యవసాయ అధికారి తెలిపారు.

వీర వసంత రావు అనే వ్యక్తి అమరావతి మండలం పల్నాడు జిల్లా నుండి చంద్రలపాడు గ్రామము, ఎన్టీఆర్ జిల్లా వాస్తవ్వుడు అయిన జంపాని నాగేశ్వర్ రావు పరిగి పట్టణంలో ఉంటూ వికారాబాద్ మండలం ధ్యాచెర్ల గ్రామములో పొలం కౌలుకు తీసుకోని నిషేదిత పత్తి విత్తనాలను సాగు చేస్తూ పక్క రైతులకు అమ్మడానికి షాద్ నగర్ లోని పరిగి రోడ్ లో గల బక్కర్మన్ గార్డెన్ ఆపొసిట్ లో గల కాళీ స్థలంలో ఇట్టి నిషేదిత పత్తి విత్తనాలను ముగ్గురు రైతులకు అంటగట్టడానికి చూడగా పోలీసు మరియు వ్యవసాయ శాఖ వారు పట్టుకోవడం జరిగిందనీ తెలిపారు..ఇట్టి తనిఖీ కార్యక్రమంలో షాద్ నగర్ ఇన్చార్జ్ ఏడి అగ్రికల్చర్ నిశాంత్ కుమార్, ఫరూక్ నగర్ వ్యవసాయ విస్తరణ అధికారి తేజ్ కుమార్, ఎస్సై శరత్, మేడ్చల్ ఎస్ఓటి ఎస్సై ధనుంజయ పాల్గొనడం జరిగిందనీ పేర్కొన్నారు.. 

#Fake cotton seeds seized in Shadnagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top