హజ్ యాత్ర అడ్వాన్స్ డిపాజిట్ గడువు పెంపు
నవంబర్ 11 కు చివరి గడువు పొడిగింపు
రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్
అమరావతి అక్టోబర్ 30
దేశవ్యాప్తంగా హజ్ -2025 యాత్ర అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీని కేంద్ర హజ్ కమిటీ పొడిగింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హజ్-2024లో తాత్కాలికంగా ఎంపిక చేయబడిన యాత్రికుల అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని రూ.1,30,300/- 21.10.2024 నాటి సర్క్యులర్ నెం.10 ప్రకారం 31.10.2024లోపు జమ చేయాల్సి ఉందన్నారు. అయితే అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేసే తేదీని మరింత పొడిగించమని దేశంలోని వివిధ రాష్ట్ర హజ్ కమిటీలు, వివిధ సంస్థలు మరియు వ్యక్తుల నుండి అభ్యర్థనలు కేంద్ర హజ్ కమిటీకి వెళ్లాయని తెలిపారు. కేంద్ర హజ్ కమిటీకి వచ్చిన వివిధ అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీగా నవంబర్ 11వ తేదీ ( 11.11.2024 23:59 గంటల) వరకు పొడిగించబడి నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత, తాత్కాలికంగా ఎంపిక చేయబడిన యాత్రికులు ఈ క్రింది పత్రాలను సంబంధిత రాష్ట్ర/UT హజ్ కమిటీలకు 14.11.2024న లేదా అంతకు ముందు సమర్పించాలని తెలిపారు.
1) హజ్ దరఖాస్తు ఫారం (HAF)
2) డిక్లరేషన్ & అండర్‌టేకింగ్
3) పే-ఇన్-స్లిప్/ఆన్‌లైన్ రసీదు కాపీ
4) మెడికల్ స్క్రీనింగ్ మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్ ప్రకారం అంటే hajcommittee.gov.in)
5) ఇంటర్నేషనల్ మెషిన్-రీడబుల్ పాస్‌పోర్ట్ స్వయం ధ్రువీకృత కాపీలు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.
Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం
యాత్రికులు అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి మరియు సంబంధిత రాష్ట్ర హజ్ కమిటీలో పత్రాలను సమర్పించడానికి నిర్దేశించిన చివరి తేదీకి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని తెలిపారు.లేని పక్షంలో వారి హజ్ సీటు రద్దుచేయబడుతుందని, తదుపరి పొడిగింపులు మంజూరు చేయబడవని కేంద్ర హజ్ కమిటీ స్పష్టం చేసినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.