ఇంటి పెరట్లో గంజాయి మొక్కల కలకలం రేపాయి ..ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బాపూజీ కాలనీలో గంజాయి మొక్కలు వెలుగుచూశాయి.
బాపూజీ కాలనీ ప్రాంతంలో రెండో వీధుల్లో నివసిస్తున్నవారికి మంగళవారం ఘర్షణ జరిగింది. దాసరి నాగమ్మ, దాసరి పేరయ్యలు తమ గృహాల్లోని పెరట్లో ..
గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై శశికుమార్ కి సమాచారం అందింది. పోలీసులు వెళ్లి మూడు మొక్కలను గుర్తించారు.
నిందితులను అదుపులోకి తీసుకొని సెబ్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు అక్కడే ఉండే శివ అనే వ్యక్తి కశాశాల విద్యార్థులు,
యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నా సెబ్ సిబ్బందికి తెలియలేదు. పోలీసుల రాకతో శివ పరారవ్వగా… మిగిలిన ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై పద్మ తెలిపారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
గంజాయి మత్తు దాని ప్రభావాలను వివిధ మార్గాల్లో చూపుతుంది. ఒక వ్యక్తి ఎంత త్వరగా మత్తులోకి వస్తాడు అనేది అది తీసుకునే రూపాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి ఉంటుంది.
ఉదాహరణకు గంజాయిని సిగరెట్లు లేదా బీడీలలో వాడితే, దాని ప్రభావం కొన్ని సెకన్లలోనే ప్రారంభమవుతుంది.
ఎందుకంటే ఊపిరితిత్తులు పొగను చాలా త్వరగా గ్రహిస్తాయి. ఈ ప్రభావం మెదడుకు త్వరగా చేరుతుంది. గంజాయి తిన్నా, తాగినా వెంటనే మత్తు వచ్చేస్తుంది.
దీని ప్రభావంతో మెదడు కొంత సమయం వరకు హైపర్యాక్టివ్గా మారుతుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ప్రమాదాలు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు.
దీని వల్ల కలిగే నష్టాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. గంజాయి మెదడు పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే మెదడు సరిగ్గా పనిచేయడం మానేస్తుంది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
అతిగా గంజాయి తీసుకున్న వారు దృష్టిని కోల్పోవడం ప్రారంభ మవుతుంది. అలాగే రక్తపోటు కూడా పెరుగు తుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు.
కళ్ళు ఎర్రగా కనిపించడం ప్రారంభిస్తాయి. శ్వాసకోశ సమస్యలు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా గంజాయిని మత్తుకే కాకుండా మందు లలో కూడా ఉపయో గిస్తున్నారు. ప్రపంచ జనాభా లో 25 శాతంమంది గంజాయిని ఉపయోగి స్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీన్ని ఔషధంగా వాడుతున్నా, వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం సరికాదు.
కానీ ఇప్పటికీ పల్లె ల్లో ఇళ్ల దగ్గర పెంచుకోవడం సర్వ సాధారణంగా యిపోయింది . గుప్పు మని గంజాయి పొగ గుంజ నీదే వారికి నిద్ర పట్టదు. పల్లెటూర్లలో గంజాయి పొడిని రెండు రకాలుగా వాడుతారు ఒకటి చెక్కతో చేసిన పరికరం అంటే సొంగ అని అంటారు దాంట్లో గంజాయి ఆకుపొడిని చేర్చి లాగుతారు. మరికొందరు సిగరెట్ లో ఉన్న పొగాకు పొడిని మొత్తం తీసేసి ఖాళీ సిగరెట్ లో ఈ ఆకును చేర్చి బహిరంగనే బహిరంగంగానే తాగుతారు.
#Ganjayimokkalu #గంజాయి మొక్కలు #పెరట్లో గంజాయి మొక్కలు #గంజాయి