బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జానపద గేయాలు పర్యావరణ చదువు అనే అంశం మీద జానపద కళాకారుని శ్రీమతి సునంద కార్యక్రమాన్ని నిర్వహించారు . కనుమరుగు అవుతున్న పల్లె పాటలు జానపదాలని ఆమె అన్నారు. విద్యతో పాటు , జానపదాలను కూడా పండితులు విద్యారతులకు నేర్పాలని కోరారు. తన మధురమైన కంఠం చేత జానపద గేయాలు, పర్యావరణం, చదువు అనే అంశాల మీద పాటలు పాడి విద్యార్థులను అల్లరింప చేశారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలతాదేవి అధ్యక్షత వహించడమైనది.తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, జనులు అలఓకుగా, ఒక తరము నుంచి మరో తరానికి, వాగ్రూపంలో వచ్చేటువంటి కళా రూపాలే జానపద కళలు. కావున మన పల్లెల్లో ఉన్న జానపదాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలియజేశారు. కార్యక్రమంలో, ఐక్యూఎ సి కోఆర్డినేటర్, డాక్టర్ బడే సాహెబ్, డాక్టర్ రామకృష్ణ, ఉమామహేశ్వర్ రెడ్డి, నరేంద్ర నాథ్ రెడ్డి,నాగ తిమ్మయ్య, రవికుమార్, మహేశ్వర్ రెడ్డి, సయ్యద్, మౌలాలి, మణికంఠ, మరియువిద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం అయినది.
జానపద గేయాలు-పర్యావరణం-చదువు
