భారీగా అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత
ముగ్గురు నిందితులు అరెస్టు..రిమాండ్
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు ఎస్ఈబి పోలీస్టేషన్ పరిధిలోని కర్నూలు ఎస్ఈబి జాయింట్ డైరెక్టర్ కృష్ణకాంత్( ఐపిఎస్) ఆదేశాలు మేరకు ఎమ్మిగనూరు ఎస్ఈబి సీఐ జయరాం నాయుడు నేతృత్వంలో భారీ గా అక్రమ కర్ణాటక మద్యం ను పట్టుకున్నారు. సోమవారం ఎస్ఈబి ఎస్ఐ సోమశేఖర్ రావు, మాధవరం చెక్ పోస్టు ఎస్ఐ చంద్రమోహన్ పోలీసు సిబ్బంది తో అక్రమ మద్యం ను తరలిస్తున్నరనే సమాచారంతో దాడులు నిర్వహించగా మాధవరం చెక్ పోస్ట్ వద్ద ఏపీ 37 బిక్యూ 6649 నంబర్ గల టాటా ఇండిగో కారులో 30 బాక్సులు 2880 (90ఎంఎల్) టెట్రా ప్యాకెట్ల అక్రమ కర్ణాటక మద్యంను దొరికింది.దీంతో టాటా ఇండిగో కారును సీజ్ చేసి,మద్యం ను తరలిస్తున్న మంత్రాలయం మండలం, రచ్చుమర్రి గ్రామానికి చెందిన పల్లెపాడు లక్ష్మయ్య, అదోని శివశంకర్, కడతట్ల ఉరుకుందు లను అరెస్ట్ చేసి రిమాండ్ కు
పంపినట్లు సిఐ జయరామ్ నాయుడు మీడియా కు తెలిపారు. ఎమ్మిగనూరు ఎస్ఈబి సీజ్ చేసిన కర్ణాటక మద్యం విలువ 1,20,000 ల రూపాయలు ఉంటుందని తెలిపారు.ఈ దాడులలో
హెడ్ కానిస్టేబుళ్లు చంద్రమౌళి, రబ్బానీ, గోపాల్,లింగప్రసాద్, కానిస్టేబుళ్ళు రామ చంద్రుడు, నరసింహారెడ్డి, రాధమ్మ,ఇందు,చంద్రన్న, సూర్యప్రకాష్ లు పాల్గొన్నారు.
భారీగా అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత
