ప్రెస్ నోట్ తేదీ: 24.09.2024
30 వ తేదీ వరకు హజ్ దరఖాస్తు గడువు పొడిగింపు
మరోసారి గడువును పొడిగించిన కేంద్రహజ్ కమిటీ ..గన్నవరం నుంచి వెళ్లే యాత్రికులకు రూ.లక్ష ప్రభుత్వ ఆర్థిక సాయం
ఏపీ మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ – అమరావతి సెప్టెంబరు 24
హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు గడువు ను మరోసారిపొడిగించినట్లు రాష్ట్రమైనార్టీసంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ మొదట ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభించి చివరి తేదీ సెప్టెంబర్ 9వ తేదీ వరకు నిర్ణయించిందని, ఈ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు.అయితే దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు మరోసారి కేంద్ర హజ్ కమిటీ పొడిగించినట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్రహజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటివరకు 1937 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
ఇందులో 1589 దరఖాస్తులు అన్ని అంశాలతో కరెక్ట్ గా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించబోతున్నట్లు తెలిపారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ కి వెళ్లే రాష్ట్ర ప్రయాణికులకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ అవకాశాన్ని రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు.
రాష్ట్రంలో రూ.105 కోట్లతో మైనారిటీ యూత్ ఎంపవర్మెంట్ కోసం మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సిలెన్స్
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, రూ 105 కోట్లతో మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సిలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మైనారిటీ యువత నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు కార్యాచరణ అమలు చేయబోతున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. ఒక్కొక్క కేంద్రాన్ని రూ. 35 కోట్లతో మైనారిటీ జనాభా ఎక్కువ గల గుంటూరు, నంద్యాల, అనంతపురం జిల్లా కేంద్రాలలో నెలకొల్పనున్నట్లు తెలిపారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణలో భాగంగా ఏ.ఐ మరియు డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధిక డిమాండ్ ఉన్న అధునాతన కోర్సులలో మైనార్టీ యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడం ద్వారా మైనార్టీలు ఆర్థికంగా ఎదిగేందుకు, స్వయం సమృద్ధి తో పరిశ్రమలు,వ్యాపార సంస్థలు, సాఫ్టువేర్ తదితర రంగాలలో అడుగుపెట్టి నిలదొక్కుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు దోహదపడుతుందని మంత్రి ఫరూక్ అన్నారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV