Elephants in Nallamala Forest
జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవి మరో ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఇప్పటికే పెద్ద పులులు, చిరుతలతో పులకిస్తున్నఅభయారణ్యంలో…
నెల క్రితం అడవి దున్న ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈక్రమంలోనే నల్లమలకు గజరాజులు రాబోతున్నాయి. అటవీలో గస్తీని మరింత పెంచేందుకు
ఫారెస్ట్ అధికారులు ఏనుగుల సహాయం తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో నల్లమలలో ఏనుగులు కనిపించబోతున్నాయి.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు : దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్ద దైన నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయా రణ్యం (ఎన్ఎస్ఈఆర్)లో పులుల సంరక్షణకు..
మరింత సమీకృత చర్యలు అవసరమని, అందులో ఏనుగులు కీలకమని ఇక్కడ పని చేసిన ఫారెస్ట్ అధి కారులు ఎప్పటి నుంచో ఆలోచన చేశారు.
వారి కలలను నిజం చేస్తూ నల్లమలకు త్వరలో ఏను గులు రాబోతున్నాయి. నల్లమల అభయారణ్యంలో విలువైన కలపతో పాటు అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి.
కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు
వన్యప్రాణి సంరక్షణకు, విపత్కర అవస రాల కోసం ఒక అనిమల్ రెస్క్యూ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వన్యప్రాణి వైద్యులతో పాటు,
మత్తు సూదులను జంతువులపై ప్రయోగిం చే షార్ప్ షూటర్ ను కూడా అందుబాటులో ఉం చారు. ఇదే కోవలో మరింత వన్యప్రాణి సంరక్షణ పద్ధతులను..
చేర్చడంలో భాగంగానే ఎనిమిది శిక్షణ: పొందిన ఏనుగులను ఎన్ఎస్టర్కు రప్పి స్తున్నారు.
ఈ మేరకు ఎన్ఎస్ఈఆర్ ఎఫ్ పీటీ బీఎన్ఎన్ మూర్తి కేంద్ర వైల్డ్ లైఫ్ బోర్డు ప్రతిపాద సలు పంపారు.
త్వరలో అక్కడ నుంచి అనుమ తులు రాగానే అవసరం మేరకు కావాల్సిన ఏనుగుల ఎంపిక జరుగనుంది. ఇప్పటికే ఏనుగుల కోసం..
కర్ణాటక ప్రభుత్వానికి కూడా అనుమతుల కోసం విజ్ఞాపనలు పంపారు.
పెద్దపులుల ప్రవర్ధ నానికి స్వర్గం లాంటి ఎన్ఎన్టీఆర్, గుండ్ల బ్రహ్మేశ్వరం (జీబీఎం) వన్యప్రాణి అభయారణ్యాలలో ఈ శిక్షణ పొందిన ఏనుగులను వినియోగించనున్నారు.
ప్రస్తుతం లోతట్టు అటవీ ప్రాంతాల్లో అటవీ సిబ్బంది వంతుల వారీగా వివిధ కంపార్ట్ మెంట్లలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తుంటారు.
అలాంటి సమయాల్లో సిబ్బంది తరుచూ ఎలుగు బంట్ల దాడులకు గురవుతుంటారు. ఇలాంటి చోట్ల ఏను గులపై నుంచి
పెట్రోలింగ్ చేస్తే ఎలుగు బంట్లనుంచి రక్షణ కలగడంతో పాటు కాస్త ఎక్కువ దూరం గస్తీ నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, చిత్తూరు, వైఎ స్సార్ జిల్లాల్లోని అడవుల నుంచి అప్పుడ ప్పుడు జనవాసాల్లోకి అడవి ఏనుగులు వస్తూ విధ్వంసం సృష్టిస్తాయి.
అప్పుడు వాటిని దారి మళ్లించి ఆడవుల్లోకి పంపడం అధికారులకు పెద్ద రిస్క్ తో కూడిన వ్యవహారం ఉన్న పరిస్థితుల్లో అధికారులు పొరుగునఉన్న
తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రాంతాలను నుంచి పెంపుడు ఏనుగులను రప్పిం చి అడవి ఏనుగుల గుంపును తరుముతుంటారు.
ఎన్ఎన్టీఆర్కు వస్తున్న ఏనుగులను అవసరమను కున్నప్పుడు అడవి ఏనుగుల నియంత్రణకు కూడా వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
1996 ప్రాంతంలో ఆత్మకూరు..
- మూడు దశాబ్దాల క్రితమే ప్రయత్నం
అటవీ డివిజన్కు ముఖ్య అధికారి (డీఎస్ఓ)గా పనిచేసిన రమణ మూర్తి నల్లమలకు ఏనుగును రప్పించేందుకు ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలిసింది.
శేషాచలం అడవుల్లో ఉన్న ఏనుగులు కడప జిల్లా సరిహద్దులకు వస్తుండడంతో వాటిని నల్లమలకు రప్పించడం పెద్ద పనికాదని ఆయన భావించే వారు.
ఇందుకోసం తన వద్ద ఉన్న ప్రణాళికలను ఉన్నతాధికారులకు ఆయన నివేదించారు కూడా. అయితే శేషాచలం కొండలకు నల్లమలకు మధ్యలో
బద్వేల్ ప్రాంతంలో అడవి పూర్తిగా మాయమై మైదానం ఏర్పడి ఉండడం ఈ ప్రయత్నాలకు మొదలే అడ్డుకట్ట పడడానికి కారణ మైంది.
అయితే ఎన్ఎన్టీఆర్లో దినదిన ప్రవర్ధ మానమవుతున్న పెద్దపులిని శేషాచలం చేర్చడంలో మాత్రం అటవీ అధికారులు సఫలీకృతమైనారు.
శ్రీశైలం – శేషాచలం టైగర్ కారిడార్ ఒక ఫలవం తమైన ప్రాజెక్ట్ గా నిలిచింది. శ్రీశైలం నుంచి పెద్ద పులి నేడు తిరుమల శేషాచలం అడవుల్లో కూడా కనిపిస్తోంది.
- రెండు నెలల్లో రావొచ్చు..బీఎల్ఎన్ మూర్తి,
ఎనిమిది ఏనుగులను ఎన్ ఎన్టీఆర్లో రక్షణ విధు లకు వినియోగించడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం..
అదే సమయంలో ఏను గుల కేటాయింపు కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తున్నాం. రెం డు నెలల్లో ఎనిమిది ఏనుగులు వస్తాయని భావిస్తు న్నాం.
నీటి వసతి ఉన్న పర్వత ప్రాంతమైన జీబీఎం, వెలుగోడు నార్త్ బీట్ ను ఏనుగులతో
సిబ్బంది పెట్రోలింగ్ చేయనున్నారు. Buy it a good pen drive