- విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకించండి :సిపిఎం
- ఏ. రణధీర్ ఆత్మకూరులోని సిపీఎం పార్టీ ఆఫీస్ ఆత్మకూరులో మీడియా సమావేశం
AP : నంద్యాల జిల్లా ఆత్మకూరు : 2022-23 సంవత్సరానికి సంబంధించి వినియోగించిన విద్యుత్ పై అదనపు సర్దుబాటు చార్జీలపై బహిరంగ ప్రకటన విడుదల చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్న కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల ప్రతి పాదనలను పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, పట్టణ నాయకులు డి రామ్ నాయక్ ఏ.సురేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
2022- 23 సంవత్సరానికి వినియోగించుకున్న విద్యుత్ పై అదనంగా సర్దుబాటు చార్జీలు (ఎఫ్ పి పి సి ఎ) రూ.7,200 కోట్ల భారం మోపుతూ విద్యుత్ నియంత్రణ మండలి( రెగ్యులేటరీ కమిషన్) నేడు బహిరంగ ప్రకటన విడుదల చేసిందన్నారు. సీపీడీసీఎల్ యూనిట్ కు రూ.3.27,1.50, 1. 47, 0. 45 పైసలు ఒక్కొక్క త్రైమాసికానికి వసూలు చేయడానికి ప్రతిపాదనలు పెట్టారన్నారు.
ఎస్ పి డీసీల్ రూ”1. 92 ,1.43 ,0. 82,0.03 పైసలు ఈపీడీసీల్ రూ” 2.07,1. 39 ,1.16, 0.38 పైసలు ఒక్కొక్క త్రైమాసికానికి వసూలు చేయటానికి ప్రతి పాదనలు పెట్టారన్నారు. ఇప్పటికే మూడు రకాల సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నారు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ చా ర్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ప్రజలకు మాట ఇచ్చిందని, వంద రోజుల ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా అభివర్ణించు కుంటూ, భారాలు మోపడం, మాట తప్పడం తగదన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ సర్దుబాటు చార్జీలను కప్పిపెట్టింది నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హాయంలో ఈ భారాల ప్రతిపాదనలను ముందుకు తెస్తు ప్రజల మీద భారాలు మోపటానికి రంగం సిద్ధమైందన్నారు.
Also Read ఉచిత ఇసుక పాలసీ..అమలు చేయాలి .. సిపిఎం డిమాండ్
గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలోనూ 2014 -19 లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వినియోగించు కున్న విద్యుత్ పై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపారు. ఆనాడు తెలుగుదేశం వ్యతి రేకించింది.. నేడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రతి పాదనలను ముందుకు తెచ్చారు . దసరా పండుగ కానుకగా ఈ భారాన్ని పాలకులు మోపుతున్నారా? ఇప్పటికే విద్యుత్ భారాలు వినియోగ దారులపై ఎక్కువగా ఉంది కార్పొరేట్ కంపెనీల దోపిడీ, ప్రభుత్వాలు, అధికారుల అవినీతి ఫలితంగా విద్యుత్ వ్యయం పెరుగు తున్నదన్నారు. దీనికి రెండు కోట్ల మంది వినియోగ దారులను బలి చేయటం సరికాదు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రతి నెల సర్దుబాటు చార్జీల భారాన్ని వసూలు చేస్తున్నారు.
సర్దుబాటు చార్జీల ప్రతిపాదనను రద్దు చేయాలి
మళ్ళీ అదనంగా ఈ భారాలు మోపటం దారుణం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ సర్దుబాటు చార్జీల ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాలి సర్దుబాటు చార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. నియంత్రణ మండలి పేరుతో భారాలను మోపితే సహించం సర్దుబాటు చార్జీల భారాన్ని ఉపసంహరించక పోతే సిపిఎం పార్టీగా ఉద్యమం సాగిస్తా మన్నారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV