- మూడు నెలల పాటు అడవిలోకి అనుమతులు నిషేదం..
- దేశంలోనే పెద్దపులుల సంరక్షణ నిలయంగా ఆత్మకూరు..
- ఎన్ టి సిఎ పెద్దపులుల సంతతి, సంరక్షణపై ప్రత్యేక చొరవ..
- నల్లమలలో వివిద ప్రమాదాలలో పెద్దపులులు ఎందుకు మృత్యుఘోష పడుతున్నాయి..
- నల్లమలలో పెద్దపులి సంతతిపై ప్రత్యేక కథనం..
నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు పారెస్టు పరిధిలో నల్లమల అడవులో పెద్దపులుల సంరక్షణ పులుల సంతతి పెరుగుతుందా లేక వాటిని మనుగడ ఏవిదంగా ఉంది. అవి ఏకాలంలో సంతతి పెంచుకుంటాయి వాటి కళయిక ఎప్పటి నుంచి ఎప్పటిదాక జరుగుతుందనే విషయాలపై ప్రత్యేక కథనం .
29 జులై ‘వరల్డ్ టైగర్స్ డే’
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పులుల సంతతి పై అటవీశాఖ అధికారులు దేశ వ్యాప్తంగా వారోత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా దేశంలోనే పెద్దపులుల అభయారణ్యంగా ప్రసిద్ధిగాంచిన నల్లమల అడవిలో పులుల సంతతి వాటి కలయికపై మూడు నెలల పాటు జనసంచారం లేకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోని పెద్దపులులకు నిశబ్దం ఉండే విదంగా సంరక్షణ కొనసాగిస్తు న్నారు. కొన్ని పెద్దపులుల వయస్సు మీద పడడంతో ఒకవైపు ఆనారోగ్యంతో మృత్యువాత పడుతున్నప్పటికి మరోవైపు వాటి సంతతి పెంచే విదంగా అటవీశాఖ అధికారులు అన్ని చర్యలు చేపడుతు న్నారు. ఈ నేపధ్యంలోనే నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, టైగర్ రిజర్వు పరిధిలో దాదాపుగా 60కిపైగా పెద్దపులులు, కూన పిల్లలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గణంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజు దేశ ప్రధాని నరేంద్రమోది పెద్దపులుల యెక్క గణంకాలను వివరిస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ఆత్మకూరు వన్యప్రాని డివిజన్ దాదాపుగా 70కి పైగా.. మగపులి, ఆడపులి ఏ కాలంలో వాటి సంతతిని పెంచుకుంటాయి…
పెద్దపులుల సంతతి
వర్షాకాలం ప్రారంభమైన జూలై నెల నుంచి సెప్టెంబర్ చివరి వరకు పెద్దపులుల సంతతికి నల్లమలలో కలయిక జరుపుకుంటాయని అటవీశాక అధికారులు ముందస్తుగానే జనసంచారం లేకుండా పులి సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ మూడు నెలల పాటు చలి, వేడిగా ఉన్న ప్రదేశంలో ఒక ఆడ పులి, మగ పులి కలసి వాటి కలయికను కలుపుకోవడం జరుగుతుంది. ఇది అరుదైన ప్రదేశాలలో విటిని సంభోదించుకుంటాయి. ఒక ఆడపులి గర్భం దాల్చిందంటే దాదాపు 2 నుంచి 4 పులుల వరకు జన్మనిస్తుంది. పెద్దపులి సంరక్షణపై ఆటవీశాఖ అధికారులు ఎక్కడే కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటి యొక్క ఉనికిని గుర్తించే విదంగా విధులు నిర్వహిస్తారు. జన్మనిచ్చిన కూనపిల్లల సంరక్షణ చేసే కాల పరిమితి ఈ ఆడపులి దాని జీవిత కాలం 20సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. ఇది కేవలం 1నుంచి 3 సార్లు మాత్రమే తమ పిల్లలకు జన్మనిస్తుంది. ఒకసారి మగపులి, ఆడపులితో కలయిక జరిగిందంటే అది మళ్లీ ఆ మగ పులి వైపు తిరిగి చూడదని అటవీశాఖలో ఎంతో మంది అధికారులు చర్చించుకోవడం విశేషం. వీటి యెుక్క కలయిక 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటియెక్క కలయిక ప్రదేశం వేడి, చల్లగా ఉండేచోట ఈ ప్రదేశాలను ముందస్తుగానే పసిగడతాయి.
ఎన్టిసిఏ అధికారులు పెద్దపులుల సంతతి ప్రతి సంవత్సరం జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మాసాలలో అంచనాలు వేసుకుంటారు. ప్రతి సంవత్సరం పెద్దపులుల సంరక్షణ కోసం లక్షల నిధులు… నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం పెద్దపులుల సంరక్షణ చేసేందుకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల నిధులను కేటాయింపు చేయడం జరుగుతుంది. ఈనేపథ్యంలోనే అడవిలో ఉండే పెద్దవులుల జనసంచారంలోకి రాకుండా వాటికి కావాల్సిన ఆహరం, నీటి వసతులు కల్పించే విదంగా అటవీశాక అధికారులు ప్రత్యేకంగా నీటి ట్యాంకర్ల ద్వారా వేసవికాలంలో వన్యప్రానుల దాహర్తీనీ తీర్చేందుకు దృష్టిసారిస్తారు. కేవలం పెద్దపులుల సంతతి కోసం అటవీశాఖ ఉన్నతాధికారులు అత్యధికంగా వీటిపైనే విది నిర్వహణ కొనసాగుస్తునే ఉంటారు. జాతీయ జంతువుగా గుర్తింపు పొందిన పెద్దపులి నల్లమల అడవికే రారాజుగా ఉంటూ ప్రతి సంవత్సరం ఎదో ఒక చోట పెద్దవులులను మృత్యుఘోష వెంటాడుతునే ఉంది. ఒకవైపు రోడ్డు ప్రమాదాలతో మరోవైపు ఆనారోగ్యాలతో అడవిలోనే పెద్దపులులు మృతిచెందిన సంఘనటలు ఎన్నో ఉన్నాయి. పెద్దపులుల సంరక్షణ చేయాల్సిన అధికారులు వాటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పవచ్చు .
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి సంరక్షణ కోసం లక్షలు రూపాయాల నిధులు కేటాయించి ఖర్చు చేస్తారు. గత కొంత కాలం నుంచి ఆత్మకూరు వన్యప్రాని డివిజన్లో మృతి చెందిన ప్రదేశాలు గత సంవత్సరంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంకు వెళ్లే రహదారిలో పెద్దపులి రోడ్డు అడ్డుగా వెళ్తూన్న విషయాని గమనించగా రోడ్డు ప్రమాదంలో ఓ పులి మృతి చెందింది. ఆత్మకూరు అటవీ డివిజన్లో గత సంవత్సరంలో ఉచ్చులో పడి ఓ పెద్దపులి మృతిచెందిన సంఘటన ఎన్నో ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలతో పాటు ఎన్నో పెద్దవులుల మృత్యుఘోష వినిపిస్తున్నప్పటికి నల్లమలలో వాటి సంతతిని పెంచే విదంగా ఎన్టిసిఏ బృందం నల్లమలలో పెద్దపులులపై ప్రత్యేక బృందాలుగా తిరిగి వాటి ఆవాసాలు సంతతి, గణంకాలు తెలిపే విదంగా ప్రతి సంవత్సరం టైగర్ సెన్సెస్ ను ప్రారంభించనున్నారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV