పచారీ కొట్లలో ఎండించిన అతిమధురం లభిస్తుంది. దీని ఔషధగుణాల గురించి తెలుసుకుందాం.
ఒక భాగం సోపు గింజల చూర్ణం, రెండు భాగాల పటికబెల్లం పొడి కలిపి రోజు రెండుసార్లు ఒక స్పూను వంతున నీటిలో కలిపి సేవిస్తుంటే దగ్గు, ఆయాసం, కడుపుబ్బరం, త్రేన్పులు, పడిశం తగ్గుతాయి. రెండు భాగాల అతి మధుర చూర్ణంలో ఒకభాగం వచ చూర్ణాన్ని కలిపి పావు స్పూను వంతున రోజుకి మూడుసార్లు తేనెతో తీసుకుంటుంటే వివిధ రకాలైన దగ్గులు తగ్గుతాయి. అతి మధురం, మిరియాలు, సుగంధిపాల, వచ చూర్ణాల్ని సమంగా కలిపి గంజితో నూరి కణతలకు పట్టిస్తుంటే పార్శ్వపు తలనొప్పులు తగ్గుతాయి. ఒక స్పూను అతిమధుర చూర్ణాన్ని మూడు నాలుగు స్పూన్ల బూడిద గుమ్మడి రసంతో కలిపి తాగుతుంటే అపస్మారకం, మూర్చ తదితర మానసిక వ్యాధులు నెమ్మదిస్తాయి. ప్రయోగశాలలో జరిగిన అధ్యయనాలలో ఈ మొక్కలో గైసరైజిక్ యాసిడ్, గ్లూకోజు, సుక్రోజు, స్టెరాయిడ్, సుగంధ తైలం మొదలగు అంశాలున్నట్లు తేలింది.
అతి మధుర చూర్ణం, సోపు గింజల చూర్ణం, శుద్ధి చేసిన గంధక భస్మం ఒక్కొక్క భాగం గ్రహించి అందులో సునాముఖిపొడి మూడింతలు, పటిక బెల్లం పొడి నాల్గింతలు కలిపి రోజూ పడుకునేముందు ఒక స్పూను వంతును సేవిస్తుంటే మలబద్ధకం తగ్గి మూల వ్యాధి తగ్గుతుంది. రక్తశుద్ధి జరిగి చర్మంపై గుల్లలు, దురదలాంటి లక్షణాలు తగ్గుతాయి. అతి మధుర చూర్ణం ఒక స్పూను వంతున రోజూ మూడుసార్లు నీటితో సేవిస్తే అధిక దాహం, కడుపులో మంట, ఎక్కిళ్లు, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి. దీన్ని బియ్యం కడుగు నీటితో సేవిస్తే స్త్రీలలో కలిగే అధిక రుతు రక్తస్రావం త్వరగా తగ్గుతుంది. పాలలో కలిపి సేవిస్తుంటే బాలింతల్లో స్తన్యవృద్ధి జరుగుతుంది. అతి మధురం, ఎండించిన మర్రిపండ్ల చూర్ణం, పటికబెల్లం పొడి సమానంగా కలిపి ఒక స్పూను వంతున మూడు పూటలా మంచి నీటితో సేవిస్తేనోటినుంచి, ముక్కు నుంచి రక్తం పడటం తగ్గుతుంది. శరీరంలోని అమితవేడి తగ్గుతుంది.
Alsho Read మూత్రాశయ రాళ్ళను కరిగించే కొండపిండి
పంజాబ్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అతిమధురం, సోపు, గుమ్మడి, రోజాపూలు మొదలగు వాటితో ఒక ఔషధాన్ని రూపొందించి ఎలుకలపై ప్రయోగించి జీర్ణాశయం లోని పుండును మాన్పే గుణాన్ని గుర్తించారు. ఈ ఔషధాన్ని ఇతర ఆధునిక ఔషధాలతోపాటు ప్రయోగిస్తే వ్యాధి ఇంకా సత్వరంగా తగ్గటంతో పాటు ఆధునిక ఔషధాల దుష్పరిణామాలు కూడా తగ్గే అవకాశముందని నిర్ధారించారు. అతిమధురం, అశ్వగంధ, శొంఠి చూర్ణాలను సమానంగా కలిపి వుంచుకొని ఈ పొడిని పూటకు అరస్పూను నుంచి స్పూను వరకు కప్పు పాలలో కలిపి ఉదయం, సాయంత్రం సేవిస్తుంటే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఒంట్లో నీరసం తగ్గి హుషారుగా ఉంటారు. అతి మధుర చూర్ణాన్ని నీటితో కలిపి గాయాలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి.
జీర్ణాశయ, శ్వాసకోశ, గర్భాశయ వ్యాధులకు అతిమధురం
అతిమధురం, కరక్కాయ, బాధం పప్పు, ద్రాక్ష, గుల్కందు, సునాముఖి కలిపి చేసిన ‘మలక్కుఠార మెజుగు’ అనే ఔషధాన్ని సిద్ధ వైద్యంలో అగ్ని మాంద్యం, మలబద్దకం,కడుపుబ్బరం మొదలగువాటిలో ఉపయోగిస్తారు.మధుయష్టి తైలం, మధుకాదిఘృతం, ధాత్రిలోహం మొదలగు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అతిమధురాన్ని జీర్ణాశయ, శ్వాసకోశ, గర్భాశయ వ్యాధులకు వాడే ఔషధాల్లో ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు. ప్రతిరోజు అరచెంచా పొడి కప్పు గోరువెచ్చని పాలలో కలిపి త్రాగుచుంటే శరీరానికి టానిక్గా పనిచేస్తుంది. ఒక మోస్తరు మలబద్దకంతో బాధపడేవారు రోజూ సాయంత్రం అర స్పూను పొడిని కప్పు గోరువెచ్చని పాలు లేదా నీటిలో కలిపి తీసుకుటుంటే మర్నాడు ఉదయం సాఫీగా విరేచనమవుతుంది. నెలల తరబడి అతిమధురం వాడితే బరువు పెరిగే అవకాశముంది.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV