గురువారం ప్రధానితో..CM చంద్రబాబు నాయుడు సమావేశం
విభజన హామీలు సహాపలు అంశాల్లో కేంద్ర సహకారం కోరనున్న చంద్రబాబు నాయుడు
APముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం 5.10 గంటలకు
విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని సి యం ఓ తెలిపింది. రాత్రికి అక్కడే బస చేసి
మరుసటి ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి పలు కీలక అంశాలు చర్చించే అవకాశముంది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఆ తరువాత హోం మంత్రి అమిత్ షా , ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , నితిన్ గడ్కరీ ,
జేపీ నడ్డా.. తదితరలను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం,
ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్టు సమచారం. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్టు తెలుస్తోంది.
కాగా, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు వెంట వెళ్లనున్నారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ప్రధాని మోడీతో ఇవాళ జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు ప్రధానంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు ఆండగా నిలవాలని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్ జగన్ కారణంగా ఈ రెండు కీలక అంశాలు మరుగునపడ్డాయని, ఇప్పుడు ఏపీ తిరిగి పుంజుకోవాలంటే ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కీలక సాయం అవసరం అవుతుందనని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, విభజన హామీలపైనా చొరవ తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
ప్రధాని మోడీతో దాదాపు గంట భేటీ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి కేంద్రమంత్రుల్ని కలిసేందుకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోనూ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ, మధ్యాహ్నం 2.45 గంటలకు హోం మంత్రి అమిత్‌షాతోనూ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు.
అలాగే రేపుఉదయం 9 గంటలకు నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం,10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 10.45 గంటలకి కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీనడ్డా, మధ్యాహ్నం 12.30గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ కానున్నారు, తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సమావేశం సమావేశం ముగించుకుని హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఎల్లుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ ఉంటుంది.