తిరుపతి జిల్లా… సత్యవేడు .. భారీ తిప్పర్లకు పోలీసులు బ్రేకులు
గత రెండు మూడు నెలలుగా సత్యవేడు పట్టణంలో గ్రావెల్ మట్టి క్వారీ టిప్పర్లు బ్లూ మెటల్ క్వారీ టిప్పర్లు సత్తి వేడు పట్టణంలో అతివేగంగా సడన్ బ్రేకులు వేస్తూ సమయ వేళలు పాటించకుండా నిరంతరం నడుపుతూ.. పట్టణంలోని వ్యాపారస్తులను ద్విచక్ర వాహనదారులను నిత్యవసర సరుకుల నిమిత్తం వస్తున్న వారిని మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తిప్పర్లకు పోలీసులు బ్రేక్ వేశారు .. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు . అడ్డు అదుపు లేకుండా వందలాది వాహనాలు సత్యవేడు ప్రధాన రహదారిలో నడుపుతూ ఉండటంతో గుండెలపై చేతులు పట్టుకుని భయభ్రాంతులు చెందుతూ బతుకు జీవుడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లకి వెళుతున్నారు.
అంతేకాక గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు శ్రీకాళహస్తి బస్టాండ్ తిరుపతి బస్టాండ్ మార్గాలలో టిప్పర్ల తాకిడి ఎక్కువ ఉండడం చేత రోడ్డు దెబ్బ తిని సిమెంట్ రోడ్డుపై కూడా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డు మార్గం అధ్వానంగా తయారైంది.
15-20 టన్నులు ట్రావెల్ వేసుకొని వెళ్లాల్సిన లారీలు 30-40 టన్నులు వేసుకొని అతి భారీ వాహనాలు వెళ్లడంతో తరచూ ద్విచక్ర వాహనాలు ఢీకొనటం కొందరికి ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా అధికంగా ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉండగా వీరిని అదుపు చేసే వాళ్ళు ఎవరూ లేరా వీళ్ళ పైన చర్యలు ఎవరు తీసుకోరా అని తీవ్రంగా ప్రజలు వ్యాపార సంఘల వాళ్లు చేర్చుకుంటున్న సమయంలో…
సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి ఎస్సై పురుషోత్తం రెడ్డి లు సత్యవేడు పట్టణంలోని వ్యాపారస్తుల అవస్థలు పట్టణ ప్రజలు పడుతున్నాడు వంటి ఇబ్బందులను గుర్తించిన ఇద్దరు అధికారులు గ్రావెల్ మట్టి క్వారీ టిప్పర్ల యాజమాన్యాలను పిలిపించి సమావేశపరిచినట్లు తెలిసింది.
ఇకపై ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సత్తి వేడు పట్టణంలో టిప్పర్లు నడుపుకోవాలని గట్టిగా హెచ్చరించారు. తిరిగి రాత్రి పది గంటల నుండి టిప్పర్లు నడుపుకోవచ్చు అంటూ ఆయన టిప్పర్ల యాజమాన్యానికి తెలిపారు.
సత్యవేడు సరిహద్దులైన రాజుల కండ్రిగ నీళ్లతోటి కండ్రిగ చెన్నై మార్గం చెక్పోస్ట్ వద్ద గట్టి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన సమయంలోనే సత్యవేడు పట్టణంలోకి అనువదించే విధంగా పోలీస్ కానిస్టేబుల్ కు ఆదేశాలు ఇచ్చారు.
ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వారు ఎవరైనా మాకు అంతా ఒకటే అని సమాధానం చెప్పినట్లు తెలియ వచ్చింది
ముఖ్యంగా పోలీస్ శాఖ అధికారులకు ప్రజల యోగక్షేమాలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపైన ఎంతైనా ఉందని అందులో భాగంగానే బాధ్యతగా వ్యవహరించడం జరుగుతుందని తెలుస్తోంది.
సత్తి వేడు పట్టణ వ్యాపార సంఘాల యాజమాన్యాలు పట్టణ ప్రజలు శభాష్ పోలీస్ అంటూ మనస్పూర్తిగా సెల్యూట్ చేసుకుంటున్నారు.
మరికొందరైతే పోలీసులు తీసుకున్న చర్యలకు మహిళలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.