బనగానపల్లె మండలం యాగంటి పల్లె కృషి విజ్ఞాన కేంద్రంలో నేల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల పకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేడు మనం నివసిస్తున్న ఈ నేల గతం నుండి మన తరానికి సంక్రమించిన వారసత్వ సంపద. ఈ నేలను కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు స్థిరమైన సుస్థిరమైన సజీవ వనరులు అందించడం మన బాధ్యత. పకృతి పట్ల మనిషిలో మేటవేసిన పలసత్వం నిర్లక్ష్యంతో పాటు నేలకు అనేక రకాలుగా విఘాతం కలిగిస్తున్నాం అందుకు శిక్ష ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరం అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మనందరం సామూహికంగా భూమికి మంచి చేసి రేపటి తరానికి సారవంతమైన నేలను అందిద్దాం. నేడు మనం కంచంలో తినే అన్నం భూమాత ప్రసాదమే. భూమిని కాపాడటమే కాదు భూమి మీద ఉన్న ఉనికిని కాపాడడం అందరి బాధ్యత ఎవరో చేస్తారులే నీ బద్దకాన్ని వదిలి ఆలోచించి ఫలితాన్ని ఇచ్చే భూమిని సారవంతం చేయాలి. మన తరువాత తరాలకు అద్భుతమైన రీతిలో కాకపోయినా కనీసం మనకు లభించిన స్థితిలోనైనా రేపటి తరానికి భూమిని అందిద్దాం. పంటలను పండించడానికి పెట్టే సాగు నీరు కంటే పురుగుమందుల రసాయనాలు ఎక్కువ పిచికారి చేస్తున్నాం. రసాయన ఆహారాలు తినడం వలన తల్లిపాలు కూడా విషతుల్యమవుతున్నాయి. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం అని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతి వనరులను అందించే దిశగా రైతులు పకృతి వ్యవసాయం చేసి నేలను కాపాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పకృతి వ్యవసాయ సిబ్బందిరైతులు పాల్గొన్నారు.