నూతన పెన్షన్లను పంపిణీ చేసిన..MLA కాటసాని

mla-katasani-ramireddy-banaganapalle.jpg

బనగానపల్లె పట్టణం పొదుపు భవనం లో నూతన వైయస్సార్ పెన్షన్ కానుకను 462 మంది లబ్ధిదారులకు పెన్షన్ ను పంపిణీ చేసిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు….

నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం పొదుపు భవనంలో వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా 462 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ .. నాడు ప్రజల సంక్షేమం కోసం ఆనాటి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు 3,648 వేల కిలోమీటర్ల మేర సుధీర్ఘ పాదయాత్ర నిర్వహించి ఆనాడు ప్రల కష్టాలు తీర్చడానికి తాను అధికారంలోకి వస్తే పార్టీలకు,కులాలకు ,మతాలకు అతీతంగా నవరత్నాలు పథకాలు అందించడం జరుగుతుంది అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చిన ఘనత మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పారు.నాడు టీడీపీ హయంలో ప్రభుత్వ పథకాలు తీసుకోవాలంటే ఆనాటి జన్మభూమి కమిటీలకు లంచాలు పుచ్చుకొని పింఛన్లు మంజూరు అయ్యేవి అని అదే వైయస్సార్ పార్టీ హయం లో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది అని చెప్పారు.అలాగే టీడీపీ హయం లో పింఛన్లు తీసుకోవాలంటే గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాచేవారు అని అదే వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ద్వారా లబ్దిదారుల ఇంటికే వెళ్లి అందించడం జరుగుతుంది అని చెప్పారు.నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో D.R.D.O ప్రాజెక్ట్ డైరెక్టర్ YB శ్రీధర్ రెడ్డి,DL.D.O జనార్దన్ రావు, వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషి రెడ్డి,మండల పార్టీ కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి,కుర్ని సంఘం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మేటికెల శ్యామల దేవి,మార్కెట్ యార్డ్ చైర్మన్ దివెనమ్మ,ఎంపీపీ మానస వీణ,పట్టణ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ,మండల ఉపాధ్యక్షురాలు మంగవరపు లక్ష్మీదేవి,యాగంటి దేవస్థానం చైర్మన్ తోట బుచ్చిరెడ్డి,కొత్తపేట సర్పంచ్ గోగుల రమణ, వైయస్సార్ పార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్,బండి బ్రంహనంద రెడ్డి,కోడూరు రామచంద్ర రెడ్డి,నందవరం తులసి రెడ్డి,ప్రజా ప్రతినిధులు మండల అభివృద్ధి అధికారి శివ రామయ్య,మండల తహశీల్దార్ రామకృష్ణా, మండల ప్రజా ప్రతినిధులు,గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top