బలిజలు ఇక్యతగా ఉన్నందుకే జనసేన పార్టి అఖండ విజయం సాధించిందని .. ఇకపై ఇక్యతగా వుండి మన హక్కులు మనం కాపాడుకోవాలని .. బలిజ సంఘం నాయకులు పిలుపు నిచ్చారు.
బలిజలకు ఐక్యత అవసరం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బలిజ కులస్తులందరూ మన యొక్క సంఖ్యాబలాన్ని పెంచుకొని ఏకత్రాటిపై నిలిచి తమ హక్కులను సాధించుకోవాలని తాలూకా బలిజ సంఘం నాయకులు నల్లగట్ల బాలుడు పిలుపునిచ్చారు.
ఆళ్లగడ్డ పట్టణంలోని టి బి రోడ్డులో ఆదివారం జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల చిత్రపటానికి పూలమాలలు వేసి .. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
బలిజల ఇక్యతే జనసేన అఖండ విజయం
కాపు బలిజల ఐక్యత వల్లనే ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ అఖండ విజయాన్ని సాధించడం జరిగిందని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగిందని నల్లగట్ల బాలుడు తెలిపారు. బలిజలకు కూడా అన్ని రంగాలలో ముందుండి మన ఉనికిని పెంచుకోవాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యే అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ను , ఆమె భర్త మద్దూరి భార్గవరామ్ లను జనసేన సమన్వయకర్త మైలేరీ మల్లయ్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు డాక్టర్ ఎం.వి. ప్రసాద్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.