ఆంధ్ర బాసరగా చెప్పుకునే నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలలో కొలువై ఉన్న కొలను భారతి పుణ్యక్షేత్రంలో
ఈనెల 14న (బుధవారం) జరగబోయే వసంత పంచమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో కొలను భారతి క్షేత్రాన్ని ఆత్మకూరు రూరల్ సీఐ నాగభూషణ్ పరిశీలించారు
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, వసంత పంచమి వేడుకలకు ఆంధ్ర రాష్ట్రం తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఆ వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా వాహనదారులు ఖాళీగా ఉన్న ప్రదేశాలలో తమ తమ వాహనాలను నిలుపుకోవాలని గత సంవత్సరం వాహనాలు భారీ సంఖ్యలో తరలి రావడం రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి భక్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కావున ట్రాఫిక్ సమస్య పునరావతం కాకుండా బారి గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని నియమించి నట్లు ఇందుకు వాహనదారులు కూడా సహకరించాలని సిఐ తెలిపారు.