గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం – చెంచు గూడెంలలో పర్యటించిన ఎమ్మెల్యే
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం బైర్లూటి – నాగలూటి గూడేం నందు గౌ.శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారికి.. గ్రామ సర్పంచి,మహిళలు ఘనంగా పూలమాలతో ,శాలవలతో స్వాగతం పలికారు
చెంచుల అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం… శిల్పా
గిరిజనులను సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయుటకు ఐటీడీఏ మరియు సేవా స్వచ్ఛంద సంస్థల ద్వారా అభివృద్ధి సాధిస్తామని శ్రీశైలం నియోజకవర్గం MLA శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ. శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆద్వర్యంలో ఆత్మకూరు మండలం బైర్లూటి ,నాగలూటి చెంచు గూడేంలో ఎమ్మెల్యే శిల్పా. చక్రపాణి రెడ్డి గారు ప్రతి గడప గడప దగ్గరికి వెళ్లి ప్రభుత్వం నుండి అందిన పథకాల గురించి వివరిస్తూ….అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించారు . ఏమైయిన సమస్యలు తన దృష్టికి వస్తే సమస్యలు ఉంటే తక్షణమే ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గారు మరియు సచివాలయం సిబ్బంది,మండల అధికారుల సమక్షంలోనే సమస్యలు పరిష్కరించుటకు ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ రవీంద్రారెడ్డి గారు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటరిలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. #gadapagadapakuManaPrabhutvam #www.politicalhunter.com