మీడియా పై ఉక్కు పాదం మోపితే అంతు చూస్తాం. ఏపీ ఎంఎఫ్.
పత్రిక కార్యాలయాలు, మీడియా ఛానల్లు, పాత్రికేయులపై జగన్ రెడ్డి దాడులు సహించం.
కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా ఆత్మకూరు లో ఏపీఎంఎఫ్ ధర్నా రాస్తారోకో.
ధర్నాకు వామపక్షాలు ప్రజాసంఘాల సంఘీభావం
ఆత్మకూరు 21 ఫిబ్రవరి (నంద్యాల జిల్లా )
ఆంధ్ర రాష్ట్రాన్ని హింసించే పులకేసి చక్రవర్తిల పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆగడాలు మీడియాపై రోజురోజుకు మితిమీరి పోతున్నాయి అంటూ ప్రజా సంఘాలు వామపక్షాలు పలు సామాజిక వర్గాలు ఆగ్రహించాయి. కర్నూలు ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పై పాణ్యం ఎమ్మెల్యే అనుచరులు, ప్రైవేటు గుండాలను ఉసిగొలిపి దాడి చేయించడం ఉమ్మడి కర్నూలు జిల్లా మీడియా చరిత్రలోనే ఒక మాయని మచ్చ అని ఆందోళనకారులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి పలువురు సంఘీభావం తెలిపి ధర్నా రాస్తారోకోలో పాల్గొన్నారు .సిద్ధం బహిరంగ సభల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రాంతాలవారీగా తమ గుండాలను ఏర్పాటు చేసి తన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అరాచకాలను బయటపెడుతున్న మీడియా సంస్థలపై దాడులు చేయండి అంటూ రెచ్చగొడుతున్నాడని ఈ విధానం జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కు దెబ్బ పడుతుందని పలువురు విమర్శించారు. మీడియాపై దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం లాంటిదని ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎన్నుకున్నారో అదే ప్రజాస్వామ్య బద్దంగా ఇంటికి పంపించాలని మేధావులు పలు రాజకీయ పార్టీ నాయకులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు సామాజిక వర్గ ప్రతినిధులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏపీఎంఎఫ్ ఆత్మకూరు డివిజన్ శ్రీశైలం నియోజకవర్గ అధ్యక్షులు
మగ్బుల్ భాష, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఓబులేసు, ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజ్, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ సుధాకర్, కార్యదర్శి నాగరాజు, గౌరవ అధ్యక్షులు శేషు, వలి ఖాన్, అన్వర్,పఠాన్ సల్మాన్ ఖాన్, శివకుమార్, రమణ, ఏపీయూడబ్ల్యూఎఫ్ ప్రతినిధి జోసెఫ్ శేఖర్, సిపిఎం ప్రతినిధి రణధీర్, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు ప్రతినిధులు దుర్గయ్య ,అబ్రహం, తదితరులు పాల్గొన్నారు మీడియాపై దాడికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం నుంచి పాణ్యం ఎమ్మెల్యే ను బర్తరఫ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు అనంతరం ఓ వినతి పత్రాన్ని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్, కు అందజేశారు.