- నాడు దివిటి దొంగల స్థావరం..
- వేడు గుప్తనిధుల దొంగల అన్వేషణ నిలయం..
- పర్యావరణ పర్యాటకానికి అనువైన ప్రాంతం..
- కృష్ణాతీరంలో ట్రెక్కింగ్ కు , రిసార్ట్ ఏర్పాటుకు అవకాశం..
ఆత్మకూరురూరల్: నల్లమల పర్వత సానువుల్ని చీల్చుకుంటూ కృష్ణా నదీ ప్రవాహం శ్రీశైలం వైపు సాగిపోతూ ఒక పెద్ద నదీలోయను అక్కడ సృష్టించింది. అలా సహజ సిద్ధంగా ఏర్పడ్డ పర్వతం అంచున నిర్మాణమైనదే ఈ అంకాళమ్మ కోట. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఉండే పెద్ద గుమ్మడాపురం గ్రామం వద్ద ప్రారంభమయ్యే నల్లమల అటవీ ప్రాంతంలో ఈ పురాతన కోటకు ఆరుదైన చరిత్ర ఉంది. చరిత్ర పుటల్లోకి వెళితే భారతదే శంలో ధగ్గులు, పిండారీలు వంటి బందిపోటు దొంగల ముఠాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కోవకు చెందిన వారే దివిటీ దొంగలు. ఎక్కడో అడవుల్లో తమ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఎంచుకున్న గ్రామాలపై దాడులు చేయడం దివిటి దొంగల పని. నాడు దివిటీ దొంగలు ఏర్పాటు చేసుకున్న రహస్య స్థావరమై అంకాళమ్మ కోట అని పెద్దలు చెబుతూ ఉండడంతో అది అనాదిగా ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఎత్తైన నల్లమల కొండలపైన ఒకవైపు లోతైన లోయ, అందులో ప్రవహించే కృష్ణానది. మూడు వైపులా దట్టమైన అడవి ఉండడంతో ఈ కోట నిర్మాణం అత్యంత పటిష్టత, భద్రతకు ఆలవాలమైంది. దివిటి దొంగలు తాము కొల్లగొట్టిన ధన రాశులను దాచుకునేందుకు ఈ కోట అనువుగా ఉండింది. ఈ కోటలో అంకాళ పరమేశ్వరి ఆలయం ఉండటంతో ఆమె పేరుననే ఈ కోటకు అంకాళమ్మ కోట అని పేరు వచ్చింది.
గుప్తనిధుల వేటగాళ్లతో విధ్వంసం Also Read కొల్లాపూర్ మహరాణి సంస్థాన కోట అంకాళమ్మ కోట
అంకాళమ్మ కోట దివిటి దొంగల స్థావరంగా చరిత్ర చెబుతుండడంతో అక్కడ నిధులు పాతి పెట్టబడి ఉం టాయన్న అపోహలతో పలువురు ఈ కోటలో అక్రమంగా తవ్వకాలు జరిపి కోట యావత్తు గుంతల మయం చేశారు. విశాలమైన కోట ప్రకారంతో విశిష్టంగా ఉండే ఈ కోట ఇప్పుడు కేవలం అనవాళ్లతో చరిత్రను గుర్తు చేస్తోంది. ఇందులో ఉన్న అంకాళమ్మ అమ్మవారి ఆలయం శిథిలమవడంతో పాటు గుప్త నిధుల వేటగాళ్ల తవ్వకాలకు కూలిపోయింది. అయితే కృష్ణా నదిలో చేపల వేటకు వలస వచ్చిన వైజాగ్ జాలర్లు తమ స్వయం కృషితో ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. అటవీ శాఖ పలుమార్లు అంకా ళమ్మ కోటలో తవ్వకాలకు వచ్చే వారిని అరెస్టు చేసి కేసులు కూడా పెట్టింది.
అందాల నిలయం చీమల తిప్ప
అంకాళమ్మ కోట నుంచి లోయలో పారే కృష్ణమ్మను దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలి గిస్తుంది. విశాలమైన లోయలో ప్రవహించే నదీ పర్యాటకానికి అనువైన ప్రాంతం అంకాలమ్మ కోటను ఒక పర్యాటక కేం ద్రంగా వినియోగించు కునేందుకు ఎన్నో అవకా శాలున్నాయి. పురాతనమైన కోట సందర్శనకు పలువురు ఉత్సాహం చూపుతారు. చీమల తిప్పపై ఎకో-టూరిజంలో భాగంగా రిసార్ట్ ఏర్పాటు చేయవచ్చు. అక్కడ నుంచి అంకాళమ్మ కోటకు ట్రెక్కింగ్, నదిలో బోటింగ్ కు అవకాశా లున్నాయి. అలాగే నది వెంట శ్రీశైలం అభిముఖంగా ప్రయాణిస్తే నదికి ఇరువైపులా నల్లమల అడవి అత్యంత అద్భుతంగా కనువిం దు చేస్తుంది. గర్భంలో సహజంగా వెలసిన ద్వీప శిఖరమే చీమల తిప్ప. ఈ కొండపై విశాఖ జాలర్లు స్థిర నివాసమేర్ప రుచుకుని నదిలో వేటకు వెళతుంటారు.
Also Read దంతాల లింగమయ్య – Dantala Lingamayya
కొండపైనుంచి చీమల తిప్ప అత్యంత సుందరంగా కనిపిస్తుంది. సిద్దేశ్వరం – సోమశిల మధ్యలో కృ ష్ణమ్మ ప్రవాహం వెంట నదీలోయలో ప్రయాణిస్తే ఎంతో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ ప్రయాణం పూర్తిగా భారత దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన శ్రీశైలం – నాగార్జున సాగర్ పెద్దపులుల అభయారణ్యం గుండా సాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం కాకమునుపు ఈ నదీలో యలో సారవంతమైన సాగుభూమి ఎంతో ఉండేది. ఆ భూమిని ఆధారంగా అనేక గ్రామాలు నల్లమల అటవీ ప్రాంతం అంచులో కృష్ణా నది ఒడ్డున ఉండేవి. బలపాల తిప్ప, మారుగుత్తి, జానాల, సిద్దేశ్వరం గ్రామాలు శ్రీశైలం వెనుకతట్టు జలాల్లో మునకకు గురయ్యాయి. బలపాలతిప్ప, మారుగుత్తి గ్రామాలు పూర్తిగా అదృశ్యం కాగా, సిద్దేశ్వరం, జానాలు గ్రామాల్లో స్వల్ప సంఖ్యలో ప్రజలు ఉన్నారు.
దుర్గమారణ్యాలైన నల్లమల నుంచి రాత్రి వేళ దివిటి ధరించి గుర్రాలపై వేగంగా వస్తూ గ్రామాలపై పడే దివిటి దొంగలంటే ప్రజలు వణికిపోయేవారు. వారి వల్ల ఎంతో ధన, ప్రాణ నష్టం కూడా కలిగేది. కాలక్రమేణ దివిటి దొంగల రాకను తెలుసుకునేం దుకు స్వీయ రక్షణకు, నల్లమల అడవుల అంచుల్లో ఉన్న పలు గ్రామాల ప్రజలు తమ ఏర్పాట్లు వారు చేసుకున్నారు. ప్రతి గ్రామంలో ఎత్తైన రక్షణ బురు జులను కట్టించుకున్నారు. వాటిపై వంతుల వారీగా నిత్య పహారా కాస్తు దూరం నుంచే దివిటి దొంగల రాకను పసి గట్టి గ్రామస్తులను హెచ్చరించేవారు. జిల్లాలోని కొత్తపల్లె మండలంలోని శివపురం, దుద్యాల, ముసలిమడుగు, వెలుగోడు మండలంలోని వేల్ప నూరు, రేగడగూడూరులలో ఇప్పటికీ అలాంటి బురుజు నిర్మాణాలు కనిపిస్తాయి.
ఇలా చేరుకోవచ్చు..
సరిగ్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న కృష్ణా నదికి కుడిగట్టు అయిన ఆంధ్రప్రదేశ్ లోని కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామ సరిహద్దుల్లో అంకాళమ్మ కోట ఉంది. తెలంగాణా వైపునుంచి రావాలంటే సోమశిల నుంచి టూరిజం బోటులో ఆరు కి.మీ. ప్రయాణిస్తే చీమల తిప్ప కనిపిస్తుంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ ద్వారా కొండ ఎక్కి అంకాళమ్మ కోట చేరుకో వచ్చు. అలాగే తెలంగాణ వైపు ఉన్న అమరగిరి నుంచి కూడా 12 కి.మీ. నదిలో ప్రయాణించి చీమల తిప్ప చేరుకోవచ్చు. కర్నూలు వైపు నుంచి వచ్చే వారు. కొత్తపల్లె మండలంలోని పెద్ద గుమ్మ డాపురం వరకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించ వచ్చు. అక్కడ నుంచి అడవిలో ప్రయాణించేం దుకు నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయా రణ్యం ఆత్మకూరు డిప్యూటి డైరెక్టర్ అనుమతి తీసు కోవాలి.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV