- : నల్లమలలోని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో దర్శనం
- : కొల్లాపూర్ మహరాణి సంస్థాన కోట
- : ఎంతో విశిష్టత పటిష్టమైన భద్రతతో నిర్మించిన కోట నిర్మాణాలు
- : నిషేదమైన ప్రాంతంలో ఈ కోట రహస్యాలపై ప్రత్యేక కథనం
- : కృష్ణనదిలోనే 40కి.మీ ప్రయాణం కొనసాగించాలి
- : గుప్తనిధుల తవ్వకాలతో కోటలో చరిత్ర ఉన్న దేవుళ్ల విగ్రహాలు ద్వంశం
- : ప్రతి మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలకు అనుమతి
నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణాపది పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని రెండు రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ప్రవహించే కృష్ణనది మధ్యలో ద్వీపసంకల్పంలా విస్తరించి రాజులు పరిపాలించిన 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటలో ఉన్న రహస్యాలు , కొల్లాపూర్ మహరాణి సంస్థానం పలు విషయాలపై ప్రత్యేక కథనం.
చీమలతిప్ప సమీపంలోని దుర్గం పరిసర ప్రాంతాలలో 16వ శతాబ్దంలో రాజులు మహరాణులు పరిపాలించిన కోట విశిష్టత నేటికి చెక్కు చెదరలేదు. పారెస్ట్ అధికారులు భక్తులకు అంకాలమ్మ కోటలో ప్రతి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. విశాలమైన కొండపై 600ల అడుగుల ఎత్తులో 21 ఎకరాల స్థలంలో ఈ కోటను నిర్మించారు. నల్లమల అటవీ ప్రాంతంలో కొందరు గుప్తనిధుల తవ్వకాల పేరుతో కోటలో ప్రవేశించి చరిత్రగా చెబుకునే విశిష్టమైన దేవుళ్ళ విగ్రహాలను ద్వంశం చేశారు . రాణులు స్నానాలు ఆచరించిన కోనేటి బావులు నేటికి భక్తులకు కనిపిస్తునే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోటకు వెళ్లాలంటే అటవీశాఖ అనుమతులు తప్పని సరిగా ఉండాల్సిందే, లేకపోతే కేసులు తప్పవు. ఈ కోటను చేరు కోవాలంటే తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపుర్ నుంచి 8కి.మీ దూరంలో కొండల మద్య ఉన్న నగరానికి చేరుకొని అక్కడి నుంచి కృష్ణానదిలో జలమార్గం ద్వారా ప్రయాణం కొనసాగిస్తే ఈ కోటకు చేరుకోవచ్చు.
AP ; నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెద్దచెరువు ప్రాంతం వరకు వాహనాలతో వెళ్లే అవకాశం ఉంది. భక్తాదులు కాలి నడకన కోటకు చేరుకొని అంకాలమ్మకు ప్రత్యేక పూజలు, నిర్వహించుకుంటారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ కోటలో వజ్రాలు, బంగారు ఆభరాణలు, నిధులు ఉన్నాయనే బ్రమతోని చరిత్రగా చెప్పే కోటను శిథిలావ్యవలో చేర్చి కేవలం అమ్మవారి కోసం భక్తులు కట్టించిన నూతన గుడి మాత్రమే దర్శనం ఇస్తుంది. 20 ఎకరాల స్థలంలో గతంలో రాజు క్రింద పనిచేసిన బంట్రోతు లు ఉండే నివాసాల దగ్గర ప్రతి ఇంటికి ఒకరోలు ఏర్పాటు చేయడం పురాతన కట్టడాలతో నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
అంకాలమ్మ కోటలో కొలువు తీరిన దేవుళ్ల దర్శనం… Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
శ్రీశైలం శైవ క్షేత్రంలో వెలసిన మల్లికార్జున, బ్రహ్మరాంభికస్వామి ఆశీస్సుల కోసం దేశ వ్యాప్తంగా ఎంతో మంది శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే వారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కృష్ణానది పరివాహాక గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు జలమార్గం ద్వారా ఈ అంకాలమ్మ కోటను సందర్శించి శ్రీశైలానికి బయలదేరే వారని చరిత్ర చెబుతుంది. కోటలో శివలింగం, వినాయక విగ్రహాం, ఆంజనేయస్వామి వివిధ రూపాలలో వెలసిన పురాతనమైన విగ్రహాలను గుప్తనిధుల పేరుతో ఎక్కడా పడితే అక్కడా ద్వసం చేశారు. కేవలం బక్తులకు దర్శనం ఇచ్చే అంకాలమ్మ దేవి, రాజులు పరిపాలించిన కాలంలో ఏర్పాటు చేసిన శివలింగం మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కోటలో ఎన్నో రహస్యాలు , వింతలు ఉన్నప్పటికి ఈ కోట చరిత్ర, విశిష్టత , తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపుర్ లో పరిపాలక చేసిన రాజుల పరిపాలనలో ఆంద్రప్రదేశ్ లోని నల్లమల అటవీ ప్రాంతంలోని చీమల తిప్ప, దుర్గం ప్రదేశాలలో ఈ కోట నిర్మాణం చేపట్టారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV