కనీస వేతనంతోనే అంగన్వాడీలకు భవిష్యత్తు
సమ్మెకు అన్నివేళలా అండగా ఉంటామన్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్
ఆత్మకూరు 30డిసెంబర్
19 రోజులుగా రాష్ట్ర వ్యాప్త అంగన్వాడి కార్యకర్తలు సమ్మె చేస్తున్నా ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని న్యాయమైన డిమాండ్లను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆత్మకూర్ డివిజన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. శనివారం శ్రీశైల నియోజకవర్గ పాలన కేంద్రం ఆత్మకూరులో అంగన్వాడీల సమ్మె దీక్ష శిబిరాన్ని సందర్శించింది. శిశువు పుట్టినది మొదలు కిషోర వయసు వచ్చేవరకు అంగన్వాడీల బాధ్యత ఎంతో కీలకమైందని అలాంటి అంగన్వాడీల సేవలను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం కరివేపాకుల తీసివేయడం బాధాకరమని APMF ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం చెల్లిస్తూ ఆదుకోవాల్సిన మానవత్వం ,కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని APMF గుర్తు చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి అంగన్వాడీల న్యాయ డిమాండ్లను అమలుపరచాలని APMF డిమాండ్ చేస్తూ సమ్మెను ఎంతకాలం చేసినా తమ పూర్తి మద్దతు ఉంటుందని అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలోAPMF ఆత్మకూరు డివిజన్ అధ్యక్షులు ఎ. మగ్బుల్ బాష, జిల్లా ప్రతినిధి ఓబులేసు, జిల్లా మీడియా ఇన్ఛార్జి సుధాకర్, గౌరవ అధ్యక్షులు శీలం శేషు, ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజు,కోశాధికారి సత్య పీటర్, సహాయ కార్యదర్శి రమణ, కార్యవర్గ సభ్యులు అన్వర్ భాష, మహేష్ ,శివకుమార్, సీనియర్ పాత్రికేయుడు జోసెఫ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు